Kaanee kaanee yimka nela kadama deerudu gaaga

కానీ కానీ యిఁక నేల కడమ దీరుతు గాక
Language

(॥పల్లవి॥)
కానీ కానీ యిఁక నేల కడమ దీరుతు గాక
ఆన సుమ్మీ నీవు వచ్చి అట్టటు వోతేను

(॥కానీ కానీ॥)
అస యిచ్చుకొని వద్ద నాతఁడు నిలుచుండఁగ
వేసిన ట్టెల్లా నీకు జెల్లదా నేఁడు
వోసరించి ముడివెట్టి వూరా కాతఁడు నవ్వఁగ
యీసునఁ జేతులు చాఁచ యిఁక నెప్పుడే

(॥కానీ కానీ॥)
మంతనాన నేమో చెప్పి మౌనాన నాతఁ డుండఁగ
యెంతైనా వాదకు రాక యేల మానేవే
యింత నిన్నుఁ జేసినట్టి యీతని దూరుతు గాక
వింతగా నిన్నే మన వెఱ్ణినా నేను

(॥కానీ కానీ॥)
వొకరి ననఁ జాలక వొప్పగిం చాతఁ డుండఁగ
అకట నీ రప మాయ నట్టె కానీవే
వెకలి యై యిత్తరి శ్రీవెంకటేశుఁడు గూడఁగ
మొకమోట నుంటిఁ గాక మోసపొయ్యేనా

(||pallavi||)
kānī kānī yim̐ka nela kaḍama dīrudu gāga
āna summī nīvu vachchi aṭṭaḍu vodenu

(||kānī kānī||)
asa yichchugŏni vadda nādam̐ḍu nilusuṁḍam̐ga
vesina ṭṭĕllā nīgu jĕlladā nem̐ḍu
vosariṁchi muḍivĕṭṭi vūrā kādam̐ḍu navvam̐ga
yīsunam̐ jedulu sām̐sa yim̐ka nĕppuḍe

(||kānī kānī||)
maṁtanāna nemo sĕppi maunāna nādam̐ ḍuṁḍam̐ga
yĕṁtainā vādagu rāga yela māneve
yiṁta ninnum̐ jesinaṭṭi yīdani dūrudu gāga
viṁtagā ninne mana vĕṟṇinā nenu

(||kānī kānī||)
vŏgari nanam̐ jālaga vŏppagiṁ sādam̐ ḍuṁḍam̐ga
agaḍa nī raba māya naṭṭĕ kānīve
vĕgali yai yittari śhrīvĕṁkaḍeśhum̐ḍu gūḍam̐ga
mŏgamoḍa nuṁṭim̐ gāga mosabŏyyenā