Kaanee kaanee yamdugemi kanemu gaaga

కానీ కానీ యందుకేమి కనేము గాక
Language

(॥పల్లవి॥)
కానీ కానీ యందుకేమి కనేము గాక
మోనాన నీకేవేళ మొక్కేమో నేము

(॥కానీ॥)
నెట్టన నీ మగువలు నీతోనే నవ్వఁగాను
చుట్టాలమై యెన్నఁడిఁకఁ జూచేమో నేము
దిట్టలై యందురు నిన్ను తేఁకువతోఁ దిట్టఁగాను
వెట్టికి నేఁగతినుండి వినేమో నేము

(॥కానీ॥)
పొలఁతులిందరు నిన్ను బొమ్మల జంకించఁగాను
చెలఁగి సాకి రెన్నఁడు చెప్పేమో నేము
అలగి వారు నీమీఁద నట్టె చేతులు చాఁచఁగ
తెలిపి మీవాదేగతిఁ దీర్చేమో నేము

(॥కానీ॥)
కోరి నీ కొలువు వారు కొంగువట్టి తియ్యఁగాను
మారుకొని యన్నఁడవి మాన్పేమో నేము
యీరీతి శ్రీ వేంకటేశ ఇట్టె నన్నుఁగూడితివి
తేరకత్తెల నేగతి దిద్దేమో నేము

(||pallavi||)
kānī kānī yaṁdugemi kanemu gāga
monāna nīgeveḽa mŏkkemo nemu

(||kānī||)
nĕṭṭana nī maguvalu nīdone navvam̐gānu
suṭṭālamai yĕnnam̐ḍim̐kam̐ jūsemo nemu
diṭṭalai yaṁduru ninnu tem̐kuvadom̐ diṭṭam̐gānu
vĕṭṭigi nem̐gadinuṁḍi vinemo nemu

(||kānī||)
pŏlam̐tuliṁdaru ninnu bŏmmala jaṁkiṁcham̐gānu
sĕlam̐gi sāgi rĕnnam̐ḍu sĕppemo nemu
alagi vāru nīmīm̐da naṭṭĕ sedulu sām̐sam̐ga
tĕlibi mīvādegadim̐ dīrsemo nemu

(||kānī||)
kori nī kŏluvu vāru kŏṁguvaṭṭi tiyyam̐gānu
mārugŏni yannam̐ḍavi mānpemo nemu
yīrīdi śhrī veṁkaḍeśha iṭṭĕ nannum̐gūḍidivi
teragattĕla negadi diddemo nemu