Kaanee kaanee yamdugemi kadalemtigi

కానీ కానీ యందుకేమి కతలేఁటికి
Language

(॥పల్లవి॥)
కానీ కానీ యందుకేమి కతలేఁటికి
మేనరికమే నీమెడగట్టీ నిఁకను

(॥కానీ॥)
బత్తితోడ నేను నీపైఁ జేయి వేసితేను
హత్తి యదరిపడేవు అదేమీ నీవు
రిత్తవలపా నాది రేకకెక్కెఁ గొనగోరు
సత్తెముగలదైతేను జాణ జేసీ నిన్నును

(॥కానీ॥)
తగవు నెరపి నీదగ్గర గూచుండితేను
అగడుగా నట్టె లోగే వదేమీ నీవు
మొగచాటా నా పొందు మొనలాయనా చన్నులు
తెగడి నిజాలదైతే దిట్టఁజేసీ నిన్నును

(॥కానీ॥)
కలసి మెలసి నిన్నుఁ గాఁగిలించుకొంటేను
అలసి బుసకట్టే అదేమీ నీవు
మెలగి శ్రీ వేంకటేశ మెరసెనా జవ్వనము
బలిమి గలదియైతే బంటుఁ జేసీ నిన్నును

(||pallavi||)
kānī kānī yaṁdugemi kadalem̐ṭigi
menarigame nīmĕḍagaṭṭī nim̐kanu

(||kānī||)
battidoḍa nenu nībaim̐ jeyi vesidenu
hatti yadaribaḍevu ademī nīvu
rittavalabā nādi regagĕkkĕm̐ gŏnagoru
sattĕmugaladaidenu jāṇa jesī ninnunu

(||kānī||)
tagavu nĕrabi nīdaggara gūsuṁḍidenu
agaḍugā naṭṭĕ loge vademī nīvu
mŏgasāḍā nā pŏṁdu mŏnalāyanā sannulu
tĕgaḍi nijāladaide diṭṭam̐jesī ninnunu

(||kānī||)
kalasi mĕlasi ninnum̐ gām̐giliṁchugŏṁṭenu
alasi busagaṭṭe ademī nīvu
mĕlagi śhrī veṁkaḍeśha mĕrasĕnā javvanamu
balimi galadiyaide baṁṭum̐ jesī ninnunu