కానీ కానీ యందు కేమి కై తప్పీనా
(॥పల్లవి॥)
కానీ కానీ యందు కేమి కై తప్పీనా
సానఁబట్టి నీగుణము జవదాఁట నిచ్చీనా
(॥కానీ॥)
చిమ్ముజూపు చూచి యిట్టె సిగ్గుపడెఁగాక నేఁడు
కొమ్మ నీపైమోహములోఁ గొఱఁతున్నదా
నెమ్మది నీమాటలకే నివ్వెరగు నొందెఁగాక
అమ్మరో నీవంతమెల్లా నట్టునిట్టు సేయదా
(॥కానీ॥)
నవ్వినందుకే నీతో ననువు నటించెఁగాక
జవ్వనినీపొందులకు సరియున్నదా
చివ్వనఁ జేయివేయఁగ చిత్తము మఱచెఁగాక
పవ్వళించేపానుపుపై పచ్చి నిన్నుఁ జేయదా
(॥కానీ॥)
నిద్దురకన్నుల నిట్టె నీపై నొరగెఁగాక
గద్దరిచెలియ మేన గర్వ మున్నదా
వొద్దిక శ్రీవేంకటేశ వువిదఁ గూడితిగాక
తిద్దని నీచేఁత తేటతెల్లమిగాఁ జేయదా
(||pallavi||)
kānī kānī yaṁdu kemi kai tappīnā
sānam̐baṭṭi nīguṇamu javadām̐ṭa nichchīnā
(||kānī||)
simmujūbu sūsi yiṭṭĕ siggubaḍĕm̐gāga nem̐ḍu
kŏmma nībaimohamulom̐ gŏṟam̐tunnadā
nĕmmadi nīmāḍalage nivvĕragu nŏṁdĕm̐gāga
ammaro nīvaṁtamĕllā naṭṭuniṭṭu seyadā
(||kānī||)
navvinaṁduge nīdo nanuvu naḍiṁchĕm̐gāga
javvaninībŏṁdulagu sariyunnadā
sivvanam̐ jeyiveyam̐ga sittamu maṟasĕm̐gāga
pavvaḽiṁchebānububai pachchi ninnum̐ jeyadā
(||kānī||)
nidduragannula niṭṭĕ nībai nŏragĕm̐gāga
gaddarisĕliya mena garva munnadā
vŏddiga śhrīveṁkaḍeśha vuvidam̐ gūḍidigāga
tiddani nīsem̐ta teḍadĕllamigām̐ jeyadā