కానీ కానీ మీఁదటెత్తు కంటిమి లేరా
(॥పల్లవి॥)
కానీ కానీ మీఁదటెత్తు కంటిమి లేరా
యీ నెపమె నేనుఁ జేసే నెందు వొయ్యే విఁకను
(॥కానీ కానీ॥)
సతి నిన్నుఁ గొంగు వట్టె సబలోన నండగాను
రతికిఁ దీసుక పోయ రా ననఁగానె
యితరకాంతల కెల్ల నిదె చా లాయ నిఁక
యితవై నీగుట్టు గంటి మెందు వొయ్యేవిఁకను
(॥కానీ కానీ॥)
మానివి నీ నోరిలోన ముక్కవఁ దమ్ముల మిడె
పానుపుపైఁ బడఁ దోసి పట్టుకోఁగానె
ఆనుక కడమవారి కప్ప ణిచ్చిన ట్లాయ
యీనటన మాకుఁ జిక్కె నెందు వొయ్యే మిఁకమ
(॥కానీ కానీ॥)
కలికి బూతులఁ దిట్టి కాఁగిలించి యంటఁ బట్టి
తలుపు మూసుక వుండెఁ దడవుగాను
లలి శ్రీవెంకటేశుఁడ లంచ మిచ్చి నన్నుఁ గూడే
విల నా కలవాటాయ నెందు వోయ్యే విఁకను
(||pallavi||)
kānī kānī mīm̐daḍĕttu kaṁṭimi lerā
yī nĕbamĕ nenum̐ jese nĕṁdu vŏyye vim̐kanu
(||kānī kānī||)
sadi ninnum̐ gŏṁgu vaṭṭĕ sabalona naṁḍagānu
radigim̐ dīsuga poya rā nanam̐gānĕ
yidaragāṁtala kĕlla nidĕ sā lāya nim̐ka
yidavai nīguṭṭu gaṁṭi mĕṁdu vŏyyevim̐kanu
(||kānī kānī||)
mānivi nī norilona mukkavam̐ dammula miḍĕ
pānububaim̐ baḍam̐ dosi paṭṭugom̐gānĕ
ānuga kaḍamavāri kappa ṇichchina ṭlāya
yīnaḍana māgum̐ jikkĕ nĕṁdu vŏyye mim̐kama
(||kānī kānī||)
kaligi būdulam̐ diṭṭi kām̐giliṁchi yaṁṭam̐ baṭṭi
talubu mūsuga vuṁḍĕm̐ daḍavugānu
lali śhrīvĕṁkaḍeśhum̐ḍa laṁcha michchi nannum̐ gūḍe
vila nā kalavāḍāya nĕṁdu voyye vim̐kanu