Kaanavachchee nee guttu kaladellaanu

కానవచ్చీ నీ గుట్టు కలదెల్లాను
Language

(॥పల్లవి॥)
కానవచ్చీ నీ గుట్టు కలదెల్లాను
దీని కేమి మీఁదటెత్తు తెలుసుకొమ్మీ

(॥కాన॥)
కొంగు దాఁకించెనంటానే గుంపించేవే; నీ మోవి
యెంగిలి సేసితే నాకె నేముందువో
సంగడిఁ గూచుండితేనే సాదించవచ్చేవు; నీ -
యంగము గోర గీరితే నప్పు డేమందువో

(॥కాన॥)
నెట్టుకొని చూచెనంటా నెపాలు వేసేవు; ఆపె
యిట్టె నీ కొప్పు వట్టితి నేముందువో
వట్టిమాఁట లాడితేనే వాసు లెక్కించుకొనేవు
తిట్టులు దిట్టితే నెంత తిరుగ నేముందువో

(॥కాన॥)
చనుఁగవ సోఁకెనంటా చలమున జరసేవు
యెనసి కాలు దొక్కితే నేమందువో
మునుపే న న్నేలితివి విమ్ముల శ్రీవేంకటేశుఁడ
వెనక నీపెఁ బెండ్లాడి వేడుక లేమందువో

(||pallavi||)
kānavachchī nī guṭṭu kaladĕllānu
dīni kemi mīm̐daḍĕttu tĕlusugŏmmī

(||kāna||)
kŏṁgu dām̐kiṁchĕnaṁṭāne guṁpiṁcheve; nī movi
yĕṁgili seside nāgĕ nemuṁduvo
saṁgaḍim̐ gūsuṁḍidene sādiṁchavachchevu; nī -
yaṁgamu gora gīride nappu ḍemaṁduvo

(||kāna||)
nĕṭṭugŏni sūsĕnaṁṭā nĕbālu vesevu; ābĕ
yiṭṭĕ nī kŏppu vaṭṭidi nemuṁduvo
vaṭṭimām̐ṭa lāḍidene vāsu lĕkkiṁchugŏnevu
tiṭṭulu diṭṭide nĕṁta tiruga nemuṁduvo

(||kāna||)
sanum̐gava som̐kĕnaṁṭā salamuna jarasevu
yĕnasi kālu dŏkkide nemaṁduvo
munube na nnelidivi vimmula śhrīveṁkaḍeśhum̐ḍa
vĕnaga nībĕm̐ bĕṁḍlāḍi veḍuga lemaṁduvo