కానవచ్చీ నందులోనే కడమదొడమలెల్లా
(॥పల్లవి॥)
కానవచ్చీ నందులోనే కడమదొడమలెల్లా
నీ నేరుపు లాపె మీఁద నెరపుమా చూతము
(॥॥)
చేపట్టుఁగుంచమనంటా సిగ్గు లీడఁ బలికేవు
ఆపెతోడ నీమాటే ఆడుమా నీవు
వోపుదునంటా నాకు వూడిగాలు చెప్పేవు
యేపున నాపెచేత చేయించుకోమ్మా చూతము
(॥॥)
గోలదాననంటా నన్నుఁ గొనగోరఁ జెనకేవు
నాలి నాపెతోడ నిట్టె నవ్వుమా నీవు
మేలుగలదాననంటా మెట్టేవు నాపాదము
గేలి నాపెపాదానఁ దాఁకించుమా చూతము
(॥॥)
సేసుకొన్నదాననంటా చేరి నన్నుఁ గూడితివి
ఆసల నాపెఁ గాగిట నంటుమా నీవు
శ్రీసతినంటా నన్ను శ్రీ వేంకటేశ యేలితి
భూసతి ఆపెను నిట్టె పొందుమా చూతము
(||pallavi||)
kānavachchī naṁdulone kaḍamadŏḍamalĕllā
nī nerubu lābĕ mīm̐da nĕrabumā sūdamu
(||||)
sebaṭṭum̐guṁchamanaṁṭā siggu līḍam̐ baligevu
ābĕdoḍa nīmāḍe āḍumā nīvu
vobudunaṁṭā nāgu vūḍigālu sĕppevu
yebuna nābĕseda seyiṁchugommā sūdamu
(||||)
goladānanaṁṭā nannum̐ gŏnagoram̐ jĕnagevu
nāli nābĕdoḍa niṭṭĕ navvumā nīvu
melugaladānanaṁṭā mĕṭṭevu nābādamu
geli nābĕbādānam̐ dām̐kiṁchumā sūdamu
(||||)
sesugŏnnadānanaṁṭā seri nannum̐ gūḍidivi
āsala nābĕm̐ gāgiḍa naṁṭumā nīvu
śhrīsadinaṁṭā nannu śhrī veṁkaḍeśha yelidi
bhūsadi ābĕnu niṭṭĕ pŏṁdumā sūdamu