Kaanavachchee mee vobigalu maagellaa

కానవచ్చీ మీ వోపికలు మాకెల్లా
Language

(॥పల్లవి॥)
కానవచ్చీ మీ వోపికలు మాకెల్లా
నానఁబెట్టేరు వలపు నంటున నిందరును

(॥॥)
వొళజొత్తుమాటలు వొకరొక రాడుకొని
జలజాక్షులు నీపై వసంతమాడేరు
పలుమారు నందరును బాసలు చేసుకొని
సొలసి సొలసి నీతో జూజాలాడేరు

(॥॥)
సరినుండి తమలోన సన్నలుసేసుకొని
మొరయుచు నీతో సాములుసేసేరు
తొరలింపు మాటలు తొలుతే పదరుకొని
వరుసవంతులకు రవ్వలుసేసేరు

(॥॥)
ముసిముసినగవులతో మొగములు చూచుకొని
అసము డించక కూడి ఆయాలంటేరు
యెసగి శ్రీ వేంకటేశ యింతలో నన్నేలితివి
పొసఁగ నందరు నీకుఁ బొందులు చూపేరు

(||pallavi||)
kānavachchī mī vobigalu māgĕllā
nānam̐bĕṭṭeru valabu naṁṭuna niṁdarunu

(||||)
vŏḽajŏttumāḍalu vŏgarŏga rāḍugŏni
jalajākṣhulu nībai vasaṁtamāḍeru
palumāru naṁdarunu bāsalu sesugŏni
sŏlasi sŏlasi nīdo jūjālāḍeru

(||||)
sarinuṁḍi tamalona sannalusesugŏni
mŏrayusu nīdo sāmuluseseru
tŏraliṁpu māḍalu tŏlude padarugŏni
varusavaṁtulagu ravvaluseseru

(||||)
musimusinagavulado mŏgamulu sūsugŏni
asamu ḍiṁchaga kūḍi āyālaṁṭeru
yĕsagi śhrī veṁkaḍeśha yiṁtalo nannelidivi
pŏsam̐ga naṁdaru nīgum̐ bŏṁdulu sūberu