Kaanavachche neegunaalu gakkana naddaribaadu

కానవచ్చె నీగుణాలు గక్కన నద్దరిపాటు
Language

(॥పల్లవి॥)
కానవచ్చె నీగుణాలు గక్కన నద్దరిపాటు
ఆనుక మంకుఁదనాన కంతదాన వవుదువే

(॥కాన॥)
నెట్టుక ఆతఁడు నేనూ నీఇంటికి వచ్చితేను
అట్టె కూచుండి లేవవు అంతదానవే
చుట్టరికము సేసితే సూడువట్టే వింతలోనె
అట్టె నీపతి యెడకు నంతదాన వౌదువే

(॥కాన॥)
చాయసేసుకొని నేము సరుసఁ గూచుండితేను
ఆయముగా వొత్తుకోవు అంతదానవే
నాయములు నడపితే నటనలు సాదించేవు
ఆయలేని రమణుని కంతాదాన వౌదువే

(॥కాన॥)
చేతులు చాఁచి నేము చెక్కులు నిన్ను నొక్కితే
ఆతలీతలఁ దిప్పే వంతదానవే
యీతల శ్రీ వేంకటేశుఁ డిద్దరిఁ గూడెను వాఁడె
ఆతనియెడకు నీ వంతదాన వౌదువే

(||pallavi||)
kānavachchĕ nīguṇālu gakkana naddaribāḍu
ānuga maṁkum̐danāna kaṁtadāna vavuduve

(||kāna||)
nĕṭṭuga ādam̐ḍu nenū nīiṁṭigi vachchidenu
aṭṭĕ kūsuṁḍi levavu aṁtadānave
suṭṭarigamu seside sūḍuvaṭṭe viṁtalonĕ
aṭṭĕ nībadi yĕḍagu naṁtadāna vauduve

(||kāna||)
sāyasesugŏni nemu sarusam̐ gūsuṁḍidenu
āyamugā vŏttugovu aṁtadānave
nāyamulu naḍabide naḍanalu sādiṁchevu
āyaleni ramaṇuni kaṁtādāna vauduve

(||kāna||)
sedulu sām̐si nemu sĕkkulu ninnu nŏkkide
ādalīdalam̐ dippe vaṁtadānave
yīdala śhrī veṁkaḍeśhum̐ ḍiddarim̐ gūḍĕnu vām̐ḍĕ
ādaniyĕḍagu nī vaṁtadāna vauduve