కానవచ్చె నీ మేననే కళలెల్లాను
(॥పల్లవి॥)
కానవచ్చె నీ మేననే కళలెల్లాను
నానని తలపోఁతలు నవ్వులు గావా
(॥కాన॥)
ఆముకొని మిక్కిలి మోహము లేనియడాటాన
వేమరు మాటలాడితే వేసట గాదా
యేమిటాఁ దనివిలేక యెరవెరవై నవేళ
చేముట్టి చెనకితేను సిగ్గులు రావా
(॥కాన॥)
పనిలేనిపనులకు పాలుపడి వద్దనుండి
వినయాలు చేసితేను వెంగెము గాదా
మన వేరొకతె పై మరిగి పైకొనఁగాను
కనువిచ్చి చూచితేను కాఁతాళము రేఁగదా
(॥కాన॥)
ముంగిటను తనమీఁదిమొగమోట లేకుండఁగా
కొంగు వట్టి తీసితేను గొరబు గాదా
కందులేక నన్ను శ్రీవేంకటేశుఁడ కూడితివి
యింగిత మొరిగితేను యింతా మేలే కాదా
(||pallavi||)
kānavachchĕ nī menane kaḽalĕllānu
nānani talabom̐talu navvulu gāvā
(||kāna||)
āmugŏni mikkili mohamu leniyaḍāḍāna
vemaru māḍalāḍide vesaḍa gādā
yemiḍām̐ danivilega yĕravĕravai naveḽa
semuṭṭi sĕnagidenu siggulu rāvā
(||kāna||)
panilenibanulagu pālubaḍi vaddanuṁḍi
vinayālu sesidenu vĕṁgĕmu gādā
mana verŏgadĕ pai marigi paigŏnam̐gānu
kanuvichchi sūsidenu kām̐tāḽamu rem̐gadā
(||kāna||)
muṁgiḍanu tanamīm̐dimŏgamoḍa leguṁḍam̐gā
kŏṁgu vaṭṭi tīsidenu gŏrabu gādā
kaṁdulega nannu śhrīveṁkaḍeśhum̐ḍa kūḍidivi
yiṁgida mŏrigidenu yiṁtā mele kādā