కానవచ్చె నీ గుణాలు కాంతలకు నిందరికి
(॥పల్లవి॥)
కానవచ్చె నీ గుణాలు కాంతలకు నిందరికి
యీ నేరుపు లేకుండితే నెమ్మెలింత సేతువా
(॥॥)
పంతగాఁడ వౌదువు బలిమి సేసి చెలని
వింత ముద్రలు మోవి పై వెలఇంచితి
ఇంత వాఁడవు గాకుంటే నెరవుల గొల్లెతల
చెంతఁ గూడి కాకు సేసి చిమ్మిరేఁతువా
(॥॥)
శూరుఁడవు నౌదువు సోయగపుఁ జెక్కులపై
గోరు దీసి జవ్వనము కొల్లగొంటివి
ధీరత ఇంత లేకుంటే దిక్కులఁ బదారువేల
కూరిమి సతుల దెచ్చుకొ పెండ్లాడుదువా
(॥॥)
అన్నిటా గబ్బివౌదువే అలమేలుమంగఁ గూడి
పిన్ననాడే వురమునఁ బెట్టుకొంటివి
యెన్నఁగ శ్రీ వేంకటేశ యీ బిగు వుండకుండితే
వన్నెలుగా నందరిని వలపింతువా
(||pallavi||)
kānavachchĕ nī guṇālu kāṁtalagu niṁdarigi
yī nerubu leguṁḍide nĕmmĕliṁta seduvā
(||||)
paṁtagām̐ḍa vauduvu balimi sesi sĕlani
viṁta mudralu movi pai vĕla̮iṁchidi
iṁta vām̐ḍavu gāguṁṭe nĕravula gŏllĕdala
sĕṁtam̐ gūḍi kāgu sesi simmirem̐tuvā
(||||)
śhūrum̐ḍavu nauduvu soyagabum̐ jĕkkulabai
goru dīsi javvanamu kŏllagŏṁṭivi
dhīrada iṁta leguṁṭe dikkulam̐ badāruvela
kūrimi sadula dĕchchugŏ pĕṁḍlāḍuduvā
(||||)
anniḍā gabbivauduve alamelumaṁgam̐ gūḍi
pinnanāḍe vuramunam̐ bĕṭṭugŏṁṭivi
yĕnnam̐ga śhrī veṁkaḍeśha yī bigu vuṁḍaguṁḍide
vannĕlugā naṁdarini valabiṁtuvā