కానవచ్చె నీ గుణాలు గక్కన నీ చేఁతలనే
(॥పల్లవి॥)
కానవచ్చె నీ గుణాలు గక్కన నీ చేఁతలనే
పూని యిట్టి వలపుల పొద్దు జరపేవా
(॥కాన॥)
వొనరి గోర నూఁదితే వోద్దంటా వేడుకొనేవు
గునిసి నిన్నెవ్వతైనాఁ గోపగించీనా
పెనఁగి కొంగువట్టితే ప్రేమ నొడఁబరచేవు
యెనయ వేరొకతెకు నిక్కువ చెప్పితివా
(॥కాన॥)
మంచిగంద మలఁదితే మగుడ నాకుఁ బూసేవు
ముంచి మోహపాకె మచ్చములు పట్టీనా
వంచనతోఁ జెనకితే లంచము మోవి ఇచ్చేవు
అంచల మీ యింటివారి కాసలు వెట్టితివా
(॥కాన॥)
పూవులదండ వేసితే పొంచి వొడిఁ బెట్టేవు
నీ వనిత యిందుకుఁగా నిన్ను నవ్వీనా
యీవేళ శ్రీవేంకటేశ యేలి నన్నుఁ బొదిగేవు
వావి నీనేగికత్తెకు వరుస ఇచ్చితివా
(||pallavi||)
kānavachchĕ nī guṇālu gakkana nī sem̐talane
pūni yiṭṭi valabula pŏddu jarabevā
(||kāna||)
vŏnari gora nūm̐dide voddaṁṭā veḍugŏnevu
gunisi ninnĕvvadainām̐ gobagiṁchīnā
pĕnam̐gi kŏṁguvaṭṭide prema nŏḍam̐barasevu
yĕnaya verŏgadĕgu nikkuva sĕppidivā
(||kāna||)
maṁchigaṁda malam̐dide maguḍa nāgum̐ būsevu
muṁchi mohabāgĕ machchamulu paṭṭīnā
vaṁchanadom̐ jĕnagide laṁchamu movi ichchevu
aṁchala mī yiṁṭivāri kāsalu vĕṭṭidivā
(||kāna||)
pūvuladaṁḍa veside pŏṁchi vŏḍim̐ bĕṭṭevu
nī vanida yiṁdugum̐gā ninnu navvīnā
yīveḽa śhrīveṁkaḍeśha yeli nannum̐ bŏdigevu
vāvi nīnegigattĕgu varusa ichchidivā