Kaanavachche namdulone kaadaa maṟi

కానవచ్చె నందులోనె కాదా మఱి
Language

(॥పల్లవి॥)
కానవచ్చె నందులోనె కాదా మఱి
ఆనవెట్టి అడిగీని అట్టెకాదా మఱి

(॥॥)
వున్నతి నేమీఁజేయక వుండఁగానేఁ దన్నుఁ జూచి
కన్నుల నవ్వితినట కాదామణి
చిన్నిచెక్కులమీఁదటి చిఱుఁజెమటలు చూచి
మిన్నక మొక్కితినట మేలుగాదా మణి

(॥॥)
వుమ్మడి నీతని వేలివుంగర మెక్కడిదంటా
కమ్మఱఁ జూచితినట కాదామణి
కమ్మినట్టి తనమేని కస్తూరివాసనలకు
సమ్మతించనైతినట సటగాదా మణి

(॥॥)
తీపులైనతన మోవి తెగువ చూపతినట
కాఁపురము లెస్సాయ కాదామఱి
పైపై శ్రీవేంకటాద్రిపతి నన్ను నిటు గూడె
చేపట్టి తనకిన్నీఁ జెల్లె గాదామఱి

(||pallavi||)
kānavachchĕ naṁdulonĕ kādā maṟi
ānavĕṭṭi aḍigīni aṭṭĕgādā maṟi

(||||)
vunnadi nemīm̐jeyaga vuṁḍam̐gānem̐ dannum̐ jūsi
kannula navvidinaḍa kādāmaṇi
sinnisĕkkulamīm̐daḍi siṟum̐jĕmaḍalu sūsi
minnaga mŏkkidinaḍa melugādā maṇi

(||||)
vummaḍi nīdani velivuṁgara mĕkkaḍidaṁṭā
kammaṟam̐ jūsidinaḍa kādāmaṇi
kamminaṭṭi tanameni kastūrivāsanalagu
sammadiṁchanaidinaḍa saḍagādā maṇi

(||||)
tībulainadana movi tĕguva sūbadinaḍa
kām̐puramu lĕssāya kādāmaṟi
paibai śhrīveṁkaḍādribadi nannu niḍu gūḍĕ
sebaṭṭi tanaginnīm̐ jĕllĕ gādāmaṟi