కానవచ్చె నాపెమీఁది కందువైన వలపులు
(॥పల్లవి॥)
కానవచ్చె నాపెమీఁది కందువైన వలపులు
నానఁబెట్టి యివి యేమి నాకుఁ జూపేవయ్యా
(॥॥)
నీమనసు వచ్చితేను నేరములు నేరుపులే
వేమారు విన్నవించినా వినఁ జవులే
గామిడి సేఁతలైనాను కడుఁదరితీపులే
యే మేమి నవ్వులై నాను ఇచ్చకములే
(॥॥)
కూటములు గలిగితే కొసరులెల్లా నింపులే
జూటరిగుంపెనలైనాను చుట్టరికమే
నీటుతోడిజంకెనలు నిండిన సంతోసాలే
చాటున గర్వములైనా సమ్మతింపులే
(॥॥)
కైవసములై తేను కాఁగిలే నిధానము
వేవేలుపంతములు వినయములే
శ్రీ వేంకటేశ నన్నుఁ జిత్తగించి యేలితివి
చేవదేరేచెనకులు సింగారాలే
(||pallavi||)
kānavachchĕ nābĕmīm̐di kaṁduvaina valabulu
nānam̐bĕṭṭi yivi yemi nāgum̐ jūbevayyā
(||||)
nīmanasu vachchidenu neramulu nerubule
vemāru vinnaviṁchinā vinam̐ javule
gāmiḍi sem̐talainānu kaḍum̐daridībule
ye memi navvulai nānu ichchagamule
(||||)
kūḍamulu galigide kŏsarulĕllā niṁpule
jūḍariguṁpĕnalainānu suṭṭarigame
nīḍudoḍijaṁkĕnalu niṁḍina saṁtosāle
sāḍuna garvamulainā sammadiṁpule
(||||)
kaivasamulai tenu kām̐gile nidhānamu
vevelubaṁtamulu vinayamule
śhrī veṁkaḍeśha nannum̐ jittagiṁchi yelidivi
sevaderesĕnagulu siṁgārāle