Kaanavachche naabai neebaim gala vehamellaanu

కానవచ్చె నాపై నీపైఁ గల వెూహమెల్లాను
Language

(॥పల్లవి॥)
కానవచ్చె నాపై నీపైఁ గల వెూహమెల్లాను
ఆనుకొన్న వవి యెట్టియడియాసలో

(॥॥)
చిత్తగించి చూడవయ్య చిరునవ్వు నవ్వీ నాపె
యిత్తల నీయాపె సఁది నెంత వనిలో
కొత్తకొత్తచెమటలు గోర నీపైఁ జిమ్మీని
తత్తరాన నది యెట్టి తడఁబాటులో

(॥॥)
వేడుకతో వినవయ్య విన్న వించఁబూనీ నాపె
వోడక నీకాపె కెంత వొడఁబాటులో
వాడిక సన్నలవే వలపులు నీపైఁ జల్లీ
యీడుజోడయిన సుద్దు లెటువంటివో

(॥॥)
అఁది కాఁగిలించుకొనవయ్య నీకు మొక్కీ నాపె
విందుల నీకాపె కెట్టివేడుకలో
యిందునె శ్రీవేంకటేశ యేలితి వీకె నింతలో
సందడి సేఁత లేరీతి సరసములో

(||pallavi||)
kānavachchĕ nābai nībaim̐ gala vĕూhamĕllānu
ānugŏnna vavi yĕṭṭiyaḍiyāsalo

(||||)
sittagiṁchi sūḍavayya sirunavvu navvī nābĕ
yittala nīyābĕ sam̐di nĕṁta vanilo
kŏttagŏttasĕmaḍalu gora nībaim̐ jimmīni
tattarāna nadi yĕṭṭi taḍam̐bāḍulo

(||||)
veḍugado vinavayya vinna viṁcham̐būnī nābĕ
voḍaga nīgābĕ kĕṁta vŏḍam̐bāḍulo
vāḍiga sannalave valabulu nībaim̐ jallī
yīḍujoḍayina suddu lĕḍuvaṁṭivo

(||||)
am̐di kām̐giliṁchugŏnavayya nīgu mŏkkī nābĕ
viṁdula nīgābĕ kĕṭṭiveḍugalo
yiṁdunĕ śhrīveṁkaḍeśha yelidi vīgĕ niṁtalo
saṁdaḍi sem̐ta lerīdi sarasamulo