కానవచ్చె మీ సుద్దులు కన్నుల పండువగాను
(॥పల్లవి॥)
కానవచ్చె మీ సుద్దులు కన్నుల పండువగాను
తానకమైన పనులు దాఁచనేల ఇఁకను
(॥॥)
చెలి నీకొప్పు దువ్వఁ గా చిన్నిగోరు సోఁకఁబోలు
పులకలు మేన నిండెఁ బొదిగొనుచు
చెలరేఁగిన మాటలు చెవులు నిండఁగఁ బోలు
సెలవుల నవ్వులిట్టె చిమ్మిరేఁగీని
(॥॥)
సతి వీడెమియ్యఁ గాను చన్నులు నిన్నొత్తఁబోలు
తతిగొని చెమటలు దైవారీని
మతకానఁ గరములు మర్మము లంటఁగఁ బోలు
కతలుగా సిగ్గు నీకుఁ గడుమించీని
(॥॥)
వెలఁది మోవితేనెల విందులు వెట్టఁగఁబోలు
కళలు నీమోమునఁ గానుపించీని
యెలమి శ్రీవేంకటేశ యీకెఁ గలసితి విట్టె
పలుమారు నీరతులు పచ్చి దేరీని
(||pallavi||)
kānavachchĕ mī suddulu kannula paṁḍuvagānu
tānagamaina panulu dām̐sanela im̐kanu
(||||)
sĕli nīgŏppu duvvam̐ gā sinnigoru som̐kam̐bolu
pulagalu mena niṁḍĕm̐ bŏdigŏnusu
sĕlarem̐gina māḍalu sĕvulu niṁḍam̐gam̐ bolu
sĕlavula navvuliṭṭĕ simmirem̐gīni
(||||)
sadi vīḍĕmiyyam̐ gānu sannulu ninnŏttam̐bolu
tadigŏni sĕmaḍalu daivārīni
madagānam̐ garamulu marmamu laṁṭam̐gam̐ bolu
kadalugā siggu nīgum̐ gaḍumiṁchīni
(||||)
vĕlam̐di movidenĕla viṁdulu vĕṭṭam̐gam̐bolu
kaḽalu nīmomunam̐ gānubiṁchīni
yĕlami śhrīveṁkaḍeśha yīgĕm̐ galasidi viṭṭĕ
palumāru nīradulu pachchi derīni