కానరాదా నీకు నాకుఁ గల మోహము
(॥పల్లవి॥)
కానరాదా నీకు నాకుఁ గల మోహము
దాని కేమి నాతోనే దాఁచకురా మోహము
(॥కాన॥)
చూచినచూపు మగుడఁ జూచినదే మోహము
యేచి వచ్చినందువచ్చు టిది మోహమూ
లాచి లాచి ముంగిట మెలఁగినదే మోహమూ
కాచుకుండి వేళవేళఁ గదియుటే మోహము
(॥కాన॥)
పలికి కమ్మర నట్టే పలుకుటే మోహము
తలఁచి మదియు నదే తలఁపవుట మోహము
పలుమారు పెలవురఁ బారనవ్వుటే మోహము
నిలువునఁ బులకించి నీలుగుటే మోహము
(॥కాన॥)
నిట్టూర్పుతో వెరగు నిండుకొంట మోహము
తెట్టలైన సిగ్గులెల్లాఁ దీరుటే మోహము
యిట్టె శ్రీవేంకటేశ యిద్దరముఁ గూడితిమి
మట్టు లేక చూపఁ జెప్పమనదేపో మోహము
(||pallavi||)
kānarādā nīgu nāgum̐ gala mohamu
dāni kemi nādone dām̐sagurā mohamu
(||kāna||)
sūsinasūbu maguḍam̐ jūsinade mohamu
yesi vachchinaṁduvachchu ṭidi mohamū
lāsi lāsi muṁgiḍa mĕlam̐ginade mohamū
kāsuguṁḍi veḽaveḽam̐ gadiyuḍe mohamu
(||kāna||)
paligi kammara naṭṭe paluguḍe mohamu
talam̐si madiyu nade talam̐pavuḍa mohamu
palumāru pĕlavuram̐ bāranavvuḍe mohamu
niluvunam̐ bulagiṁchi nīluguḍe mohamu
(||kāna||)
niṭṭūrbudo vĕragu niṁḍugŏṁṭa mohamu
tĕṭṭalaina siggulĕllām̐ dīruḍe mohamu
yiṭṭĕ śhrīveṁkaḍeśha yiddaramum̐ gūḍidimi
maṭṭu lega sūbam̐ jĕppamanadebo mohamu