కానని యజ్ఞానులాల కర్మజాతులాల మీరు
(॥పల్లవి॥)
కానని యజ్ఞానులాల కర్మజాతులాల మీరు
మానక కర్మములు సేసి మాయఁ జిక్కవలెనా
(॥కానని॥)
తపము సేసితమంటా దాఁటరాని గర్వ మేల
తపము రావణాదులు తగఁ జేయరా
అపురూపమైన నారాయణనామ ముచ్చరించే
ప్రపన్నులతోడి సరియా బ్రహ్మదులు
(॥కానని॥)
మహిలోఁ బుణ్యములంటా మదియించగ మీ కేల
మహిలోఁ బుణ్యులు గారా నహుషాదులు
సహజపుద్వయానుసంధాన పరులైన
వహి కేక్కే వైష్ణవులవంటివారా సురలూ
(॥కానని॥)
అందేము సర్గలోకమంటా రాజస మేల
అందఁడా స్వర్గము నరకాసురుఁడు
చందపు శ్రీ వేంకటేశు చక్రలాంఛనులతో
పొంది జీవన్ముక్తులకు పురుఁడా సోమపులు
(||pallavi||)
kānani yajñānulāla karmajādulāla mīru
mānaga karmamulu sesi māyam̐ jikkavalĕnā
(||kānani||)
tabamu sesidamaṁṭā dām̐ṭarāni garva mela
tabamu rāvaṇādulu tagam̐ jeyarā
aburūbamaina nārāyaṇanāma muchchariṁche
prabannuladoḍi sariyā brahmadulu
(||kānani||)
mahilom̐ buṇyamulaṁṭā madiyiṁchaga mī kela
mahilom̐ buṇyulu gārā nahuṣhādulu
sahajabudvayānusaṁdhāna parulaina
vahi kekke vaiṣhṇavulavaṁṭivārā suralū
(||kānani||)
aṁdemu sargalogamaṁṭā rājasa mela
aṁdam̐ḍā svargamu naragāsurum̐ḍu
saṁdabu śhrī veṁkaḍeśhu sakralāṁchhanulado
pŏṁdi jīvanmuktulagu purum̐ḍā somabulu