Kaaname ne mimta taanu kadirigaamdauda

కానమే నే మింత తాను కదిరికాఁడౌత
Language

(॥పల్లవి॥)
కానమే నే మింత తాను కదిరికాఁడౌత
మోనాన నే నూరుకున్న మోముచూచీఁ దాను

(॥॥)
నగుతా నేనొకమాట నాలో గోణఁగుకుంటే
తగిలి సూడకుఁ బాడు తానిదేమే
మొగి నాపుక్కిటితమ్మ ముందర నే నుమిసితే
జగడానకే వచ్చీ జాణఁడౌనే తాను

(॥॥)
వీదిఁబోతా చమ్మాళిగె వెస నేఁ దాటించితేను
ఆదిగొని కొపగించీ నదేమే తాను
సేదదేరి బోమ్మలను చెలుల నే జింకించితే
పొదితో వహించుకుని పోరీనే తాను

(॥॥)
కివిసి మాగోడండఁ గేకరించుకొంటేను
చెనకి నాకొంగువట్టీ చెల్లఁబో తాను
యెనసి శ్రీవేంకటేశుడఁ డేమీ ననకుండితేను
తనివితో ననుఁగూడె తలఁగఁడే తాను

(||pallavi||)
kāname ne miṁta tānu kadirigām̐ḍauda
monāna ne nūrugunna momusūsīm̐ dānu

(||||)
nagudā nenŏgamāḍa nālo goṇam̐guguṁṭe
tagili sūḍagum̐ bāḍu tānideme
mŏgi nābukkiḍidamma muṁdara ne numiside
jagaḍānage vachchī jāṇam̐ḍaune tānu

(||||)
vīdim̐bodā sammāḽigĕ vĕsa nem̐ dāḍiṁchidenu
ādigŏni kŏbagiṁchī nademe tānu
sedaderi bommalanu sĕlula ne jiṁkiṁchide
pŏdido vahiṁchuguni porīne tānu

(||||)
kivisi māgoḍaṁḍam̐ gegariṁchugŏṁṭenu
sĕnagi nāgŏṁguvaṭṭī sĕllam̐bo tānu
yĕnasi śhrīveṁkaḍeśhuḍam̐ ḍemī nanaguṁḍidenu
tanivido nanum̐gūḍĕ talam̐gam̐ḍe tānu