Kaamuni balamulellaa kaamtamaim bottugalase

కాముని బలములెల్లా కాంతమైఁ బొత్తుగలసె
Language

(॥పల్లవి॥)
కాముని బలములెల్లా కాంతమైఁ బొత్తుగలసె
కామినులాల మనకుఁ గతలాయను

(॥॥)
పున్నమచద్రుఁడు యీపొలఁతినెమ్మోమైతే
కన్నులే కలువలై కదిసీ నందే
వున్నతంపుఁజిలుకలు వువిదపలుకులైతే
పన్నినకెమ్మోవి బింబఫలమాయను

(॥॥)
నెలఁతనడపులివి నెమలిభావములై తే
మెలుపున నెరిఁదురుము మేఘమాయను
అలరి ననుఁ దొడలె అరఁటికంబములై తే
చెలరేఁగి నెన్నడుము సింహమాయను

(॥॥)
మగువకంఠము నేఁడు మదనునిశంఖమైతే
జగడించుఁజన్నులే చక్రవాకములాయ
తగు శ్రీ వేంకటపతి ధరియించి కూడఁగాను
మిగుల నింతికి మేలుమీఁద మేలే ఆయను

(||pallavi||)
kāmuni balamulĕllā kāṁtamaim̐ bŏttugalasĕ
kāminulāla managum̐ gadalāyanu

(||||)
punnamasadrum̐ḍu yībŏlam̐tinĕmmomaide
kannule kaluvalai kadisī naṁde
vunnadaṁpum̐jilugalu vuvidabalugulaide
panninagĕmmovi biṁbaphalamāyanu

(||||)
nĕlam̐tanaḍabulivi nĕmalibhāvamulai te
mĕlubuna nĕrim̐durumu meghamāyanu
alari nanum̐ dŏḍalĕ aram̐ṭigaṁbamulai te
sĕlarem̐gi nĕnnaḍumu siṁhamāyanu

(||||)
maguvagaṁṭhamu nem̐ḍu madanuniśhaṁkhamaide
jagaḍiṁchum̐jannule sakravāgamulāya
tagu śhrī veṁkaḍabadi dhariyiṁchi kūḍam̐gānu
migula niṁtigi melumīm̐da mele āyanu