Kaamugunigela tagavulu visaarimchi

కాముకునికేల తగవులు విచారించి
Language

(॥పల్లవి॥)
కాముకునికేల తగవులు విచారించి
ప్రేమగలచోట మేలుపెంచు టింతేకాక

(॥॥)
పున్నమవెన్నెలవలె పొలఁతి నీతో నవ్వితే
సన్నలనేల తిట్టేవు చందురువిని
కన్నులకలువలను గక్కన నిన్నుఁ జూచితే
పన్ని మరునితోనేల సంతమాడేవయ్యా

(॥॥)
ముక్కులైనచన్నుల మెనల నిన్నొత్తితేను
జక్కవపిట్టలనేల సాదించేవు
నిక్కినకొనగోరను నీ మేను దాఁకించితేను
దక్కక మొగలిరేకు కొన రాచనేలయ్యా

(॥॥)
పలుకుల వెంగేలు పలుమారు నిన్నాడితే
చిలుకలనేల జంకించేవయ్యా
అలమి శ్రీవేంకటేశ ఆకె రతి మించితే
చెలికతైల నెంతసంతోసించేవయ్యా

(||pallavi||)
kāmugunigela tagavulu visāriṁchi
premagalasoḍa melubĕṁchu ṭiṁtegāga

(||||)
punnamavĕnnĕlavalĕ pŏlam̐ti nīdo navvide
sannalanela tiṭṭevu saṁduruvini
kannulagaluvalanu gakkana ninnum̐ jūside
panni marunidonela saṁtamāḍevayyā

(||||)
mukkulainasannula mĕnala ninnŏttidenu
jakkavabiṭṭalanela sādiṁchevu
nikkinagŏnagoranu nī menu dām̐kiṁchidenu
dakkaga mŏgaliregu kŏna rāsanelayyā

(||||)
palugula vĕṁgelu palumāru ninnāḍide
silugalanela jaṁkiṁchevayyā
alami śhrīveṁkaḍeśha āgĕ radi miṁchide
sĕligadaila nĕṁtasaṁtosiṁchevayyā