Kaamugumdaina vaanigi ghanamu gomchemu ledu

కాముకుఁడైన వానికి ఘనము గొంచెము లేదు
Language

(॥పల్లవి॥)
కాముకుఁడైన వానికి ఘనము గొంచెము లేదు
యేమీ ననఁగరాదు ఇదివో నీ సుద్దులు

(॥కాము॥)
ఆఁటదియైతేఁజాలు నంటుకొనేవు గక్కున
వాఁటమైనసూదిరాతివలెనే నీవు
కూటమిలో గొల్లవారిగొల్లు నీకునితవాయ
యీటువెట్టి చూడఁబోతే నిదివో నీసుద్దులు

(॥కాము॥)
ముక్కు మొకముఁ జూడవు ముదితైతేఁ జేకొనేవు
నిక్కినతృణగ్రాహినీలమువలె
గక్కన నంగడిదానిగందము నీకితవాయ
ఇక్కువఁ దెలుపఁబోతే ఇదివో నీసుద్దులు

(॥కాము॥)
నెలఁతనుఁ బట్టపుదేవులఁగాఁ జేసుకొంటివి
వెలలేనట్టిపరుసవేదివలె
కలగంపపెండ్లిండ్లు కన్నచోట నితవాయ
యెలమి శ్రీవేంకటేశ ఇదివో నీసుద్దులు

(||pallavi||)
kāmugum̐ḍaina vānigi ghanamu gŏṁchĕmu ledu
yemī nanam̐garādu idivo nī suddulu

(||kāmu||)
ām̐ṭadiyaidem̐jālu naṁṭugŏnevu gakkuna
vām̐ṭamainasūdirādivalĕne nīvu
kūḍamilo gŏllavārigŏllu nīgunidavāya
yīḍuvĕṭṭi sūḍam̐bode nidivo nīsuddulu

(||kāmu||)
mukku mŏgamum̐ jūḍavu mudidaidem̐ jegŏnevu
nikkinatṛṇagrāhinīlamuvalĕ
gakkana naṁgaḍidānigaṁdamu nīgidavāya
ikkuvam̐ dĕlubam̐bode idivo nīsuddulu

(||kāmu||)
nĕlam̐tanum̐ baṭṭabudevulam̐gām̐ jesugŏṁṭivi
vĕlalenaṭṭibarusavedivalĕ
kalagaṁpabĕṁḍliṁḍlu kannasoḍa nidavāya
yĕlami śhrīveṁkaḍeśha idivo nīsuddulu