కాముకులైనవారికి కల్పవృక్షమువంటిది
(॥పల్లవి॥)
కాముకులైనవారికి కల్పవృక్షమువంటిది
గోమునఁ బెంచితే నెలకొను సంతోసములు
(॥కాము॥)
మొగములు చూచితేనే మొలచును వలపులు
చిగిరించు మాటలాడి చెనకితేను
అగపడి నిలిచితే నల్లుకొనుఁ బ్రియములు
నగినంతలోననే నసలెత్తు నాసలు
(॥కాము॥)
కాయములు సోఁకితేను కలఁగు మకరందము
ఆయము లంటితే ఫలమందు నపుడే
చాయలా సన్నలా సరసములనె పక్వమౌను
దాయక పాయకుండితే తరితీపులెక్కను
(॥కాము॥)
తమకపురతులను తతి యెప్పుడైనా నౌను
జమళితలపోఁతల చవులు వుట్టు
అమర శ్రీవేంకటేశుఁ డలమేల్ మంగఁ గూడఁగా
మమతలనే వసంత మహిమలు నిండెను
(||pallavi||)
kāmugulainavārigi kalbavṛkṣhamuvaṁṭidi
gomunam̐ bĕṁchide nĕlagŏnu saṁtosamulu
(||kāmu||)
mŏgamulu sūsidene mŏlasunu valabulu
sigiriṁchu māḍalāḍi sĕnagidenu
agabaḍi niliside nallugŏnum̐ briyamulu
naginaṁtalonane nasalĕttu nāsalu
(||kāmu||)
kāyamulu som̐kidenu kalam̐gu magaraṁdamu
āyamu laṁṭide phalamaṁdu nabuḍe
sāyalā sannalā sarasamulanĕ pakvamaunu
dāyaga pāyaguṁḍide taridībulĕkkanu
(||kāmu||)
tamagaburadulanu tadi yĕppuḍainā naunu
jamaḽidalabom̐tala savulu vuṭṭu
amara śhrīveṁkaḍeśhum̐ ḍalamel maṁgam̐ gūḍam̐gā
mamadalane vasaṁta mahimalu niṁḍĕnu