కాంతునిఁ దప్పక చూచి కన్నులెల్లా యఱ్ఱనాయ
(॥పల్లవి॥)
కాంతునిఁ దప్పక చూచి కన్నులెల్లా యఱ్ఱనాయ
యెంతయినా మానదు కాఁక యిఁక నేమి సేతునే
(॥కాంతుని॥)
తా నిందాఁకా రానెందుకు దగ్గరి నే వాదు సేసి
వూని యంత దిట్టినాను పోదు గోపము
ఆనవెట్టి రమణునియంగము పచ్చిసేసినా
మానదు నా చల మిఁక మఱి యేమి సేతునే
(॥కాంతుని॥)
సారె బొంకినందుకు సంగడివా రెల్లాఁ జూడ
చేరి పాదానఁ జిమ్మినా చింత వాయదు
కూరిమి నాపతి నిట్టె కుచములఁ గుమ్మినాను
తీరదు నా నెంజెరిలి దీని కేమి సేతునే
(॥కాంతుని॥)
ఆకడఁ దాఁ బరాకైనయందుకు నెగడవెట్టి
వాకిటఁ దన్ను నాఁగినా వగపు పోదు
కైకొని శ్రీవేంకటాద్రికడపరాయఁడు గూడె
వాకున నాడక మానవదె నేమి సేతునే
(||pallavi||)
kāṁtunim̐ dappaga sūsi kannulĕllā yaṭranāya
yĕṁtayinā mānadu kām̐ka yim̐ka nemi sedune
(||kāṁtuni||)
tā niṁdām̐kā rānĕṁdugu daggari ne vādu sesi
vūni yaṁta diṭṭinānu podu gobamu
ānavĕṭṭi ramaṇuniyaṁgamu pachchisesinā
mānadu nā sala mim̐ka maṟi yemi sedune
(||kāṁtuni||)
sārĕ bŏṁkinaṁdugu saṁgaḍivā rĕllām̐ jūḍa
seri pādānam̐ jimminā siṁta vāyadu
kūrimi nābadi niṭṭĕ kusamulam̐ gumminānu
tīradu nā nĕṁjĕrili dīni kemi sedune
(||kāṁtuni||)
āgaḍam̐ dām̐ barāgainayaṁdugu nĕgaḍavĕṭṭi
vāgiḍam̐ dannu nām̐ginā vagabu podu
kaigŏni śhrīveṁkaḍādrigaḍabarāyam̐ḍu gūḍĕ
vāguna nāḍaga mānavadĕ nemi sedune