Kaamtum dide neegorage kaasugunnaamdu

కాంతుఁ డిదె నీకొరకే కాచుకున్నాఁడు
Language

(॥పల్లవి॥)
కాంతుఁ డిదె నీకొరకే కాచుకున్నాఁడు
సంతోసము లెక్కలేదు జాజర లాడేవు

(॥కాంతుఁ॥)
శిరసెత్తి చూడఁగదె చెలియ నీ పతి మోము
తిరముగా సిగ్గులేల తెరగట్టేవు
సరసము లాడఁగదె సంగడిఁ గూచుండి నీవు
పెరరేఁచి మోనమేల పేరఁబెట్టేవు

(॥కాంతుఁ॥)
మాటలాడఁగదవె మనసార నాతనితో
మాటుసేసి మోవి యంత మాఁగఁబెట్టేవు
వాటముగా నవ్వఁగదె వలపులు చల్లి నీవు
గాఁటపు నివ్వెరగేల గంపఁబెట్టేవు

(॥కాంతుఁ॥)
చిత్తగించి కూడఁగదె శ్రీవేంకటేశునితోడ
గుత్తపు గుబ్బలనేల గూఁటఁబెట్టేవు
బత్తియెల్లాఁ జూపఁగదె పాదాలొత్తి యిట్టె నీవు
హత్తిన తమకమెంత అంగడివేసేవు

(||pallavi||)
kāṁtum̐ ḍidĕ nīgŏrage kāsugunnām̐ḍu
saṁtosamu lĕkkaledu jājara lāḍevu

(||kāṁtum̐||)
śhirasĕtti sūḍam̐gadĕ sĕliya nī padi momu
tiramugā siggulela tĕragaṭṭevu
sarasamu lāḍam̐gadĕ saṁgaḍim̐ gūsuṁḍi nīvu
pĕrarem̐si monamela peram̐bĕṭṭevu

(||kāṁtum̐||)
māḍalāḍam̐gadavĕ manasāra nādanido
māḍusesi movi yaṁta mām̐gam̐bĕṭṭevu
vāḍamugā navvam̐gadĕ valabulu salli nīvu
gām̐ṭabu nivvĕragela gaṁpam̐bĕṭṭevu

(||kāṁtum̐||)
sittagiṁchi kūḍam̐gadĕ śhrīveṁkaḍeśhunidoḍa
guttabu gubbalanela gūm̐ṭam̐bĕṭṭevu
battiyĕllām̐ jūbam̐gadĕ pādālŏtti yiṭṭĕ nīvu
hattina tamagamĕṁta aṁgaḍivesevu