(॥పల్లవి॥)
కాంతయేమీ నెఱఁగదుగాని
చెంతల నీగతి చెప్పరే చెలులు
(॥కాంత॥)
చిత్తజు నమ్ములు శిరసున ముడవఁగ
గెత్తుకెట్ల దాఁకెనో గాని
గుత్తపుఁజెక్కుల కుంకుమచెమటలు
జొత్తులు గారీఁ జూడరే చెలులు
(॥కాంత॥)
చలువమేనిపై సరులహారములు
చెలగిఁ నాని మొలచెనో కాని
పులకల మొలకలఁ బొదలినపయిరులు
వెలసె నిదివో భావించరె చెలులు
(॥కాంత॥)
ఘనుఁడగు శ్రీ వేంకటపతి గూడఁగ
చెనకి గుఱుతు సేసెనోకాని
వెనకముందరల వింతలు వొడమెను
కనుగొనరే యిది గక్కన జెలులు
(||pallavi||)
kāṁtayemī nĕṟam̐gadugāni
sĕṁtala nīgadi sĕppare sĕlulu
(||kāṁta||)
sittaju nammulu śhirasuna muḍavam̐ga
gĕttugĕṭla dām̐kĕno gāni
guttabum̐jĕkkula kuṁkumasĕmaḍalu
jŏttulu gārīm̐ jūḍare sĕlulu
(||kāṁta||)
saluvamenibai sarulahāramulu
sĕlagim̐ nāni mŏlasĕno kāni
pulagala mŏlagalam̐ bŏdalinabayirulu
vĕlasĕ nidivo bhāviṁcharĕ sĕlulu
(||kāṁta||)
ghanum̐ḍagu śhrī veṁkaḍabadi gūḍam̐ga
sĕnagi guṟudu sesĕnogāni
vĕnagamuṁdarala viṁtalu vŏḍamĕnu
kanugŏnare yidi gakkana jĕlulu