కాంతలు పదారువేలు గలవాఁడవు
(॥పల్లవి॥)
కాంతలు పదారువేలు గలవాఁడవు
యెంత సేసే విటు నీతో నెదురాడే దాననా
(॥కాంతలు॥)
నన్ను మన్నించ వలసి నాతో నవ్వితిని గాక
యెన్నఁగ నావంటివారు యెంత లేదు
చిన్నఁబోకుండాను నాచెక్కు నొక్కే వింతే కాక
మిన్నక నేర్పుల నిన్ను మెప్పించేదాననా
(॥కాంతలు॥)
నామీద కృప గలిగి ననుపు సేసేవు గాక
యేమీ నే నిందరిలో నేమి బాఁతి
దీమసము చెడకుండ తివిరి బుజ్జగించేవు
కామించి నీమన సంత కరఁగించేదాననా
(॥కాంతలు॥)
కడు నన్ను నేలె నని కాఁగిలించు కొంటి గాక
యెడమని నీరతికి యీడా నేను
బడినె శ్రీవెంకటేశ పాయకుండా మరపేవు
కడ లేనిమోహానకు కాణాచిదాననా
(||pallavi||)
kāṁtalu padāruvelu galavām̐ḍavu
yĕṁta sese viḍu nīdo nĕdurāḍe dānanā
(||kāṁtalu||)
nannu manniṁcha valasi nādo navvidini gāga
yĕnnam̐ga nāvaṁṭivāru yĕṁta ledu
sinnam̐boguṁḍānu nāsĕkku nŏkke viṁte kāga
minnaga nerbula ninnu mĕppiṁchedānanā
(||kāṁtalu||)
nāmīda kṛpa galigi nanubu sesevu gāga
yemī ne niṁdarilo nemi bām̐ti
dīmasamu sĕḍaguṁḍa tiviri bujjagiṁchevu
kāmiṁchi nīmana saṁta karam̐giṁchedānanā
(||kāṁtalu||)
kaḍu nannu nelĕ nani kām̐giliṁchu kŏṁṭi gāga
yĕḍamani nīradigi yīḍā nenu
baḍinĕ śhrīvĕṁkaḍeśha pāyaguṁḍā marabevu
kaḍa lenimohānagu kāṇāsidānanā