కాంతలెల్లా నెఱిఁగిరి కందువ మీ సుద్దులు
(॥పల్లవి॥)
కాంతలెల్లా నెఱిఁగిరి కందువ మీ సుద్దులు
చెంతనుండి ఇంత రట్టు సేసుకొందురా
(॥కాంత॥)
జలజాక్షికొప్పులోనిసంపెంగపువ్వులు రాలె
పెలుచుఁదనాన నీవు పెనఁగఁగాను
తిలకించ యప్పటిని తెరలోనికిఁ దియ్యఁగ
గలగల నందెలు గజ్జెలుఁ గదలెను
(॥కాంత॥)
అంగనగుబ్బలమీఁదిహారములు చిక్కువడె
రంగుగా నంటిముట్టి సరసమాడఁగా
చెంగటనే గిలిగించి చిమ్మిరేఁగ నవ్వించఁగా
సింగారపుఁ బయ్యదల్లా చెమటఁ దడిసెను
(॥కాంత॥)
కామినినిట్టూర్పుల గాలి విసరఁగఁజొచ్చె
ఆమనిరతుల నాకె నలయించఁగా
యేమరించి శ్రీవేంకటేశ నీవీఁకె గూడఁగా
దోమటిమోవితేనెలు తొటతొట నూరెను
(||pallavi||)
kāṁtalĕllā nĕṟim̐giri kaṁduva mī suddulu
sĕṁtanuṁḍi iṁta raṭṭu sesugŏṁdurā
(||kāṁta||)
jalajākṣhigŏppulonisaṁpĕṁgabuvvulu rālĕ
pĕlusum̐danāna nīvu pĕnam̐gam̐gānu
tilagiṁcha yappaḍini tĕralonigim̐ diyyam̐ga
galagala naṁdĕlu gajjĕlum̐ gadalĕnu
(||kāṁta||)
aṁganagubbalamīm̐dihāramulu sikkuvaḍĕ
raṁgugā naṁṭimuṭṭi sarasamāḍam̐gā
sĕṁgaḍane giligiṁchi simmirem̐ga navviṁcham̐gā
siṁgārabum̐ bayyadallā sĕmaḍam̐ daḍisĕnu
(||kāṁta||)
kāmininiṭṭūrbula gāli visaram̐gam̐jŏchchĕ
āmaniradula nāgĕ nalayiṁcham̐gā
yemariṁchi śhrīveṁkaḍeśha nīvīm̐kĕ gūḍam̐gā
domaḍimovidenĕlu tŏḍadŏḍa nūrĕnu