కాంతలచేత నిన్నిటా కాయగావఁబోలు మేను
(॥పల్లవి॥)
కాంతలచేత నిన్నిటా కాయగావఁబోలు మేను
యెఁ(యెం?)తైనాఁ బంకించడు యిచ్చగించీ నందుకే
(॥కాంత॥)
సరస మెంతాడినాను సమ్మతించీనన్నిటికి
వెరవఁ డెందుకై నాను వేడుకకాఁడు
గొరబులుగా గోరకుమ్మెలువో నూఁదినాను
పెరరేఁచి సారెసారె ప్రియపడీ నందుకే
(॥కాంత॥)
నవ్వులెన్ని నవ్వినానుననుపు సేసుకొనీని
వువ్విళ్లూరి జడియఁ డుబ్బరికాఁడు
కువ్వలుగా నురమున కుచములు దాఁకించినా
రవ్వలై సిగ్గువడఁడు రతికెక్కీ నందుకే
(॥కాంత॥)
కాఁగిలెట్టు బిగించినా కరఁగీ లోలోననె
వీఁగక నన్నిట్టె కూడె వేగిరకాఁడు
చేఁగదేర్పినాను మోవి శ్రీవేంకటేశ్వరుఁడు
మాఁగనీఁడువలపులు మన్నించీనందుకే
(||pallavi||)
kāṁtalaseda ninniḍā kāyagāvam̐bolu menu
yĕm̐(yĕṁ?)tainām̐ baṁkiṁchaḍu yichchagiṁchī naṁduge
(||kāṁta||)
sarasa mĕṁtāḍinānu sammadiṁchīnanniḍigi
vĕravam̐ ḍĕṁdugai nānu veḍugagām̐ḍu
gŏrabulugā goragummĕluvo nūm̐dinānu
pĕrarem̐si sārĕsārĕ priyabaḍī naṁduge
(||kāṁta||)
navvulĕnni navvinānunanubu sesugŏnīni
vuvviḽlūri jaḍiyam̐ ḍubbarigām̐ḍu
kuvvalugā nuramuna kusamulu dām̐kiṁchinā
ravvalai sigguvaḍam̐ḍu radigĕkkī naṁduge
(||kāṁta||)
kām̐gilĕṭṭu bigiṁchinā karam̐gī lolonanĕ
vīm̐gaga nanniṭṭĕ kūḍĕ vegiragām̐ḍu
sem̐gaderbinānu movi śhrīveṁkaḍeśhvarum̐ḍu
mām̐ganīm̐ḍuvalabulu manniṁchīnaṁduge