Kaamtalalonellaa yettu kaligivaidive neevu

కాంతలలోనెల్లా యెట్టు కలికివైతివే నీవు
Language

(॥పల్లవి॥)
కాంతలలోనెల్లా యెట్టు కలికివైతివే నీవు
యెంతని పొగడవచ్చు నిటువంటి నిన్నును

(॥కాంత॥)
మాటలాడి రమణుని మనసెంత గరఁచేవే
పాటలు వాడి యేల భ్రమయించేవే
సూటిగాఁ జూచిచూచి చొక్కుల నేమి వెట్టేవే
నీటున నీకత లెందు నేర్చుకొంటివే

(॥కాంత॥)
అక్కరతో నవ్వు నవ్వి ఆసలెంత కొలిపేవే
చెక్కు గోరనూఁది యేల సిగ్గు రేఁచేవే
తక్కకు వద్దఁ గూచుండి తమి యెంత వుట్టించేవే
ఇక్కువ యీచేఁతలకు యెంత జాణవైతివే

(॥కాంత॥)
సన్నలెల్లాఁ జేసి యెంత చాయకు దెచ్చుకొంటివే
చన్నుల నొరసి యేమి సాముసేసేవే
అన్నిటా నలమేల్మంగ వాతఁడు శ్రీవేంకటేశుఁ -
డెన్నికగాఁ బెండ్లాడితి వెంత వొసపరివే

(||pallavi||)
kāṁtalalonĕllā yĕṭṭu kaligivaidive nīvu
yĕṁtani pŏgaḍavachchu niḍuvaṁṭi ninnunu

(||kāṁta||)
māḍalāḍi ramaṇuni manasĕṁta garam̐seve
pāḍalu vāḍi yela bhramayiṁcheve
sūḍigām̐ jūsisūsi sŏkkula nemi vĕṭṭeve
nīḍuna nīgada lĕṁdu nersugŏṁṭive

(||kāṁta||)
akkarado navvu navvi āsalĕṁta kŏlibeve
sĕkku goranūm̐di yela siggu rem̐seve
takkagu vaddam̐ gūsuṁḍi tami yĕṁta vuṭṭiṁcheve
ikkuva yīsem̐talagu yĕṁta jāṇavaidive

(||kāṁta||)
sannalĕllām̐ jesi yĕṁta sāyagu dĕchchugŏṁṭive
sannula nŏrasi yemi sāmuseseve
anniḍā nalamelmaṁga vādam̐ḍu śhrīveṁkaḍeśhum̐ -
ḍĕnnigagām̐ bĕṁḍlāḍidi vĕṁta vŏsabarive