Kaamtalagum burushulagum galadella nimdaamka

కాంతలకుఁ బురుషులకుఁ గలదెల్ల నిందాఁక
Language

(॥పల్లవి॥)
కాంతలకుఁ బురుషులకుఁ గలదెల్ల నిందాఁక
వింత విూఱిపుడేల వేసంటందాఁకా

(॥కాంత॥)
తాలిములు మేలిములు దగ్గరిన యందాఁక
చాలైన కుంటెనలు సతమైనదాఁకా
వాలుఁజూపుల సొలపువలలఁ జిక్కినదా క
జోలిమాటలు తమకు సొలసినందాఁకా

(॥కాంత॥)
అడఁకువలు మోనములు అలుక దీరినదాఁక
వడిగొన్న కోరికెలు వలసినందాఁకా
కడలేని జంకెనలు కైవసం బౌదాఁక
వుడివొని పంతములు వోపినందాఁకా

(॥కాంత॥)
రతివేళ మోహములు రాకొట్టి నందాఁక
అతనుభోగములు మే నలసి నందాఁకా
యితవైన శ్రీవేంకటేశ నీకును సతికి
తతి నిట్లఁ గూడ సంతము లయినదాఁకా

(||pallavi||)
kāṁtalagum̐ buruṣhulagum̐ galadĕlla niṁdām̐ka
viṁta viూṟibuḍela vesaṁṭaṁdām̐kā

(||kāṁta||)
tālimulu melimulu daggarina yaṁdām̐ka
sālaina kuṁṭĕnalu sadamainadām̐kā
vālum̐jūbula sŏlabuvalalam̐ jikkinadā ka
jolimāḍalu tamagu sŏlasinaṁdām̐kā

(||kāṁta||)
aḍam̐kuvalu monamulu aluga dīrinadām̐ka
vaḍigŏnna korigĕlu valasinaṁdām̐kā
kaḍaleni jaṁkĕnalu kaivasaṁ baudām̐ka
vuḍivŏni paṁtamulu vobinaṁdām̐kā

(||kāṁta||)
radiveḽa mohamulu rāgŏṭṭi naṁdām̐ka
adanubhogamulu me nalasi naṁdām̐kā
yidavaina śhrīveṁkaḍeśha nīgunu sadigi
tadi niṭlam̐ gūḍa saṁtamu layinadām̐kā