Kaamtalagum badulagu kala sahajame yidi

కాంతలకుఁ బతులకు కల సహజమే యిది
Language

(॥పల్లవి॥)
కాంతలకుఁ బతులకు కల సహజమే యిది
వింతలు సేయక యిఁక విచ్చేయు మాయింటికి

(॥కాంత॥)
ఘనుఁడవై ననిన్నుఁగన్న వారిమీఁదఁ బెట్టి
పనివడి నవ్వితిని పలుమారును
చనవు సేసుక నిన్ను సటలెల్లా నాడితిని
వెనక నేరాలు దీర విచ్చేయు మాయింటికి

(॥కాంత॥)
మన్నించి నీవు నాపై మచ్చికలు చూపఁగానే
కన్నుల జంకించితిని కడుఁగడును
వున్నతుఁడవై ననీతో నూరక నేఁ బెనఁగితి
విన్నపాలంతేసి నేర విచ్చేయు మాయింటికి

(॥కాంత॥)
శ్రీవేంకటేశ నీచిత్తము నే నెఱఁగక
వావి నలమేల్మంగనై వచ్చి కూడితి
దేవుఁడ విన్నిటా నీవు తెలిసి నే మొక్కితిని
వేవేలు వచ్చెను నేఁడు విచ్చేయు మాయింటికి

(||pallavi||)
kāṁtalagum̐ badulagu kala sahajame yidi
viṁtalu seyaga yim̐ka vichcheyu māyiṁṭigi

(||kāṁta||)
ghanum̐ḍavai naninnum̐ganna vārimīm̐dam̐ bĕṭṭi
panivaḍi navvidini palumārunu
sanavu sesuga ninnu saḍalĕllā nāḍidini
vĕnaga nerālu dīra vichcheyu māyiṁṭigi

(||kāṁta||)
manniṁchi nīvu nābai machchigalu sūbam̐gāne
kannula jaṁkiṁchidini kaḍum̐gaḍunu
vunnadum̐ḍavai nanīdo nūraga nem̐ bĕnam̐gidi
vinnabālaṁtesi nera vichcheyu māyiṁṭigi

(||kāṁta||)
śhrīveṁkaḍeśha nīsittamu ne nĕṟam̐gaga
vāvi nalamelmaṁganai vachchi kūḍidi
devum̐ḍa vinniḍā nīvu tĕlisi ne mŏkkidini
vevelu vachchĕnu nem̐ḍu vichcheyu māyiṁṭigi