Kaamtalagum badulagu kala saajame yidi

కాంతలకుఁ బతులకు కల సాజమె యిది
Language

(॥పల్లవి॥)
కాంతలకుఁ బతులకు కల సాజమె యిది
వింతదాననా నీకు వెర పేలమ్మా

(॥కాంత॥)
కందువకు దీసేది కన్నుల నదలించేది
యిందరికి గలదె యే మమ్మా
యిందుకుఁగా నాతఁడు యెగ్గు వట్టీనా నిన్ను
విందుల వెరపు చల్లీ వెర పేలమ్మా

(॥కాంత॥)
పెనఁగితేఁ దిట్టేది బెరసితే మెచ్చేది
వనితల కీపాటి వలె నమ్మా
చన విచ్చె నాతఁడు సలిగె గలదు నీకు
వెనక ముందరి కింక వెర పేలమ్మా

(॥కాంత॥)
కూడి యిట్టె చొక్కేది గురుతులు నించేది
పాడి పంత మెక్కె నీకు పైపై నమ్మా
వోడక శ్రీవెంకటేశుఁ డురమున బెట్టె నిన్ను
వేడుకకు వెల లేదు వెర పేలమ్మా

(||pallavi||)
kāṁtalagum̐ badulagu kala sājamĕ yidi
viṁtadānanā nīgu vĕra pelammā

(||kāṁta||)
kaṁduvagu dīsedi kannula nadaliṁchedi
yiṁdarigi galadĕ ye mammā
yiṁdugum̐gā nādam̐ḍu yĕggu vaṭṭīnā ninnu
viṁdula vĕrabu sallī vĕra pelammā

(||kāṁta||)
pĕnam̐gidem̐ diṭṭedi bĕraside mĕchchedi
vanidala kībāḍi valĕ nammā
sana vichchĕ nādam̐ḍu saligĕ galadu nīgu
vĕnaga muṁdari kiṁka vĕra pelammā

(||kāṁta||)
kūḍi yiṭṭĕ sŏkkedi gurudulu niṁchedi
pāḍi paṁta mĕkkĕ nīgu paibai nammā
voḍaga śhrīvĕṁkaḍeśhum̐ ḍuramuna bĕṭṭĕ ninnu
veḍugagu vĕla ledu vĕra pelammā