కాంతలకుఁ బతులకు గడవరా దీమాయ
(॥పల్లవి॥)
కాంతలకుఁ బతులకు గడవరా దీమాయ
యెంతని చెప్పుదుఁ దానే యెరుఁగు నా వలపు
(॥॥)
వదినె మరఁది యనే వావులే యాసలు రేఁచు
కదిసి పాయకుండితే కాఁక వుట్టించు
చెదరనిచూపులే చింతకు మూలములవు
పొదలునేకాంతాలు పొందులెల్లాఁ జేయును
(॥॥)
పచ్చిదేరే సిగ్గులే భావములు గరఁగించు
ముచ్చట నవ్వులే కడుమోహము నించు
కచ్చు పెట్టి సరససాలు కాయము లంటింపించు
యిచ్చకము వినయము నింపులు వుట్టించును
(॥॥)
పాయపుమదములు గొబ్బన రతులకుఁ దీసు
చాయలు సన్నలు మోవిచవులు చూపు
యీయెడ శ్రీ వేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
ఆయమైనమాటలు అన్నిటాఁ జొక్కించును
(||pallavi||)
kāṁtalagum̐ badulagu gaḍavarā dīmāya
yĕṁtani sĕppudum̐ dāne yĕrum̐gu nā valabu
(||||)
vadinĕ maram̐di yane vāvule yāsalu rem̐su
kadisi pāyaguṁḍide kām̐ka vuṭṭiṁchu
sĕdaranisūbule siṁtagu mūlamulavu
pŏdalunegāṁtālu pŏṁdulĕllām̐ jeyunu
(||||)
pachchidere siggule bhāvamulu garam̐giṁchu
muchchaḍa navvule kaḍumohamu niṁchu
kachchu pĕṭṭi sarasasālu kāyamu laṁṭiṁpiṁchu
yichchagamu vinayamu niṁpulu vuṭṭiṁchunu
(||||)
pāyabumadamulu gŏbbana radulagum̐ dīsu
sāyalu sannalu movisavulu sūbu
yīyĕḍa śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
āyamainamāḍalu anniḍām̐ jŏkkiṁchunu