Kaamtalagellaam jeppam gadalaayanu

కాంతలకెల్లాఁ జెప్పఁ గతలాయను
Language

(॥పల్లవి॥)
కాంతలకెల్లాఁ జెప్పఁ గతలాయను
చెంతనే వినేవారికి సిగ్గులాయను

(॥॥)
వాడల వాడలనెల్లా వనితల మీఁద నీకు
వేడుక వలపు చల్లువెదలాయను
కూడిన కూటములను గొల్లెతలకు నీకును
యేడఁ జూచినాఁ జెమట లేరులాయను

(॥॥)
ఆవుల మందలోన నాఁడువారిఁ గంటే నీకు
వావుల పొందులు పెద్ద వాములాయను
చేవ మీర రేపల్లెలో చెలుల చన్నులు నీకు
పూవుల గుత్తులవలె పూజలాయను

(॥॥)
యమునానదిలోపల నంగనల జల కేలి
సమరతి మించి నీకు జాజరాయను
అమర శ్రీవేంకటేశ అట్టే నన్ను నేలితివి
తమితోడి సేసపాలు తలపోఁతలాయను

(||pallavi||)
kāṁtalagĕllām̐ jĕppam̐ gadalāyanu
sĕṁtane vinevārigi siggulāyanu

(||||)
vāḍala vāḍalanĕllā vanidala mīm̐da nīgu
veḍuga valabu salluvĕdalāyanu
kūḍina kūḍamulanu gŏllĕdalagu nīgunu
yeḍam̐ jūsinām̐ jĕmaḍa lerulāyanu

(||||)
āvula maṁdalona nām̐ḍuvārim̐ gaṁṭe nīgu
vāvula pŏṁdulu pĕdda vāmulāyanu
seva mīra reballĕlo sĕlula sannulu nīgu
pūvula guttulavalĕ pūjalāyanu

(||||)
yamunānadilobala naṁganala jala keli
samaradi miṁchi nīgu jājarāyanu
amara śhrīveṁkaḍeśha aṭṭe nannu nelidivi
tamidoḍi sesabālu talabom̐talāyanu