Kaamtalaala yimtulaala kamtiraa yidi

కాంతలాల యింతులాల కంటిరా యిది
Language

(॥పల్లవి॥)
కాంతలాల యింతులాల కంటిరా యిది
యెంత కెంత కెత్తుకొంటి వెరఁగరా నేను

(॥కాంత॥)
వొక్కమాట నిన్నంటె వూరివారిపైఁ జుట్టేవు
మిక్కిలి ముడికాఁడవు మేలురా నీవు
మక్కళించి నీ చేఁతలు మాయ వలసి యీరీతి
యెక్క డెక్కడో పెనచే దెరఁగరా నేను

(॥కాంత॥)
వాదు నీతోఁ బెట్టుకొంటె వాడవారిపై బెట్టేవు
మేదకపుకొయ్య వదువు మేలురా నీవు
ఆదెస నీ నేరాలు అందులోనే పులిమేవు
యేది తుది మొద లౌటా నెరఁగరా నేను

(॥కాంత॥)
పొంచి నీవె కల్ల వంటె పొరుగు కప్పగించేవు
మించెను నీ చలములే మేలురా నీవూ
యెంచి నట్టె శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
యించుకంత కపటము యెఱఁగరా నేను

(||pallavi||)
kāṁtalāla yiṁtulāla kaṁṭirā yidi
yĕṁta kĕṁta kĕttugŏṁṭi vĕram̐garā nenu

(||kāṁta||)
vŏkkamāḍa ninnaṁṭĕ vūrivāribaim̐ juṭṭevu
mikkili muḍigām̐ḍavu melurā nīvu
makkaḽiṁchi nī sem̐talu māya valasi yīrīdi
yĕkka ḍĕkkaḍo pĕnase dĕram̐garā nenu

(||kāṁta||)
vādu nīdom̐ bĕṭṭugŏṁṭĕ vāḍavāribai bĕṭṭevu
medagabugŏyya vaduvu melurā nīvu
ādĕsa nī nerālu aṁdulone pulimevu
yedi tudi mŏda lauḍā nĕram̐garā nenu

(||kāṁta||)
pŏṁchi nīvĕ kalla vaṁṭĕ pŏrugu kappagiṁchevu
miṁchĕnu nī salamule melurā nīvū
yĕṁchi naṭṭĕ śhrīvĕṁkaḍeśha nannum̐ gūḍidivi
yiṁchugaṁta kabaḍamu yĕṟam̐garā nenu