Kaamtalaala soodare kannula pamduga livi

కాంతలాల చూడరే కన్నుల పండుగ లివి
Language

(॥పల్లవి॥)
కాంతలాల చూడరే కన్నుల పండుగ లివి
వింతయైన తనలోని వేడు కెటువంటిదో

(॥॥)
సింగారించుకొనఁ గాను చెలియ విభునిఁ జూచి
అంగ మెల్లఁ జెమరించె నా యెట్టిదో
రంగుగ మోవిమీఁది రసముల నిగ్గు చూచి
సంగతిగా నో రూరీచవు లెట్టివో

(॥॥)
పతి వాఁడే జవరాలు పవళించుండగఁ జూచి
మతి నివెవ్వరగులయ్యీ మక్కువెట్టిదో
చతురతఁ గొలువులో చక్కఁదనములు చూచి
తతిగొని పులకంచీ దమకము లెట్టివో

(॥॥)
శ్రీవేంకటేశ్వరుఁడు సెలవి నవ్వఁగాఁ జూచి
భావించీ నలమేల్మంగబత్తి యెట్టిదో
యీవేళఁ గౌఁగిటఁ గూడి యీతనినేరుపు చూచి
చేవ దేరీఁ గళలతో చేఁత లెట్టివో

(||pallavi||)
kāṁtalāla sūḍare kannula paṁḍuga livi
viṁtayaina tanaloni veḍu kĕḍuvaṁṭido

(||||)
siṁgāriṁchugŏnam̐ gānu sĕliya vibhunim̐ jūsi
aṁga mĕllam̐ jĕmariṁchĕ nā yĕṭṭido
raṁguga movimīm̐di rasamula niggu sūsi
saṁgadigā no rūrīsavu lĕṭṭivo

(||||)
padi vām̐ḍe javarālu pavaḽiṁchuṁḍagam̐ jūsi
madi nivĕvvaragulayyī makkuvĕṭṭido
saduradam̐ gŏluvulo sakkam̐danamulu sūsi
tadigŏni pulagaṁchī damagamu lĕṭṭivo

(||||)
śhrīveṁkaḍeśhvarum̐ḍu sĕlavi navvam̐gām̐ jūsi
bhāviṁchī nalamelmaṁgabatti yĕṭṭido
yīveḽam̐ gaum̐giḍam̐ gūḍi yīdaninerubu sūsi
seva derīm̐ gaḽalado sem̐ta lĕṭṭivo