Kaamtalaala kamtirade kadagum gaallu molase

కాంతలాల కంటిరటే కతకుఁ గాళ్ళు మొలచె
Language

(॥పల్లవి॥)
కాంతలాల కంటిరటే కతకుఁ గాళ్ళు మొలచె
యింతసేసే పతికంటే యిట్టే నేనే వెగటు

(॥కాంత॥)
విరహతాపానకంటే విసువే ఘన మాయె
గరిమెఁ బెరకెంపులకంటే పెద్దాయెఁ గన్నీరు
ధర నిట్టూర్పులకంటే తమకమే యెక్కు డాయె
వరుసవానకంటే వంగుడే ఘనము

(॥కాంత॥)
చిత్తములో చింతకంటె చెక్కుచేయే దిష్టము
మొత్తపువయసుకంటే మొనచన్నులే బరవు
జొత్తులమైకాఁకాకంటే చూపులరేసులు మించె
కొత్తచేనివానికంటే కుప్పీకాఁడే బలువు

(॥కాంత॥)
కౌఁగిటిరతులకంటే కమ్మఁజెమటే బలిమి
మాఁగిన యీ మోవికంటె మంచిమాటలే తీపు
వీఁగుచు శ్రీవేంకటాద్రివిభుఁడిట్టే ననుఁ గూడె
చేగకంటె కొననున్న చిగురే పొడవు

(||pallavi||)
kāṁtalāla kaṁṭiraḍe kadagum̐ gāḽḽu mŏlasĕ
yiṁtasese padigaṁṭe yiṭṭe nene vĕgaḍu

(||kāṁta||)
virahadābānagaṁṭe visuve ghana māyĕ
garimĕm̐ bĕragĕṁpulagaṁṭe pĕddāyĕm̐ gannīru
dhara niṭṭūrbulagaṁṭe tamagame yĕkku ḍāyĕ
varusavānagaṁṭe vaṁguḍe ghanamu

(||kāṁta||)
sittamulo siṁtagaṁṭĕ sĕkkuseye diṣhṭamu
mŏttabuvayasugaṁṭe mŏnasannule baravu
jŏttulamaigām̐kāgaṁṭe sūbularesulu miṁchĕ
kŏttasenivānigaṁṭe kuppīgām̐ḍe baluvu

(||kāṁta||)
kaum̐giḍiradulagaṁṭe kammam̐jĕmaḍe balimi
mām̐gina yī movigaṁṭĕ maṁchimāḍale tību
vīm̐gusu śhrīveṁkaḍādrivibhum̐ḍiṭṭe nanum̐ gūḍĕ
segagaṁṭĕ kŏnanunna sigure pŏḍavu