కాంతల సిగ్గు లింతేసి కాకుసేతురా
(॥పల్లవి॥)
కాంతల సిగ్గు లింతేసి కాకుసేతురా
యింత వేగిరమేఁటికి యెనసేవుగాక
(॥కాంత॥)
విందువెట్టి యాపె నీకు విడెము చేతికియ్యఁగా
సందడించి పయ్యదలో చన్నులంటేవు
గందము వూసి వూడిగములు నీకుఁ జేయఁగా
అంది మోవితేనెలకు నట్టె లాచేవు
(॥కాంత॥)
పువ్వులు ముడిచి నీకుఁ బూఁచి కొప్పువట్టఁగాను
పవ్వళించుమని కొంగువట్టి తీసేవు
నివ్వటిల్ల సింగారించి నీకు సొమ్మలు వెట్టఁగా
చివ్వన నీకొనగోరు చెక్కున నూఁదేవు
(॥కాంత॥)
చొక్కించి యీపె నీకు సురటి విసరఁగాను
గక్కనఁ దమకమునఁ గాఁగిలించేవు
ఇక్కడ శ్రీవేంకటేశ నీకు చల్లఁగానే
మక్కువఁ గూడి సదమదమయ్యేవు
(||pallavi||)
kāṁtala siggu liṁtesi kāgusedurā
yiṁta vegiramem̐ṭigi yĕnasevugāga
(||kāṁta||)
viṁduvĕṭṭi yābĕ nīgu viḍĕmu sedigiyyam̐gā
saṁdaḍiṁchi payyadalo sannulaṁṭevu
gaṁdamu vūsi vūḍigamulu nīgum̐ jeyam̐gā
aṁdi movidenĕlagu naṭṭĕ lāsevu
(||kāṁta||)
puvvulu muḍisi nīgum̐ būm̐si kŏppuvaṭṭam̐gānu
pavvaḽiṁchumani kŏṁguvaṭṭi tīsevu
nivvaḍilla siṁgāriṁchi nīgu sŏmmalu vĕṭṭam̐gā
sivvana nīgŏnagoru sĕkkuna nūm̐devu
(||kāṁta||)
sŏkkiṁchi yībĕ nīgu suraḍi visaram̐gānu
gakkanam̐ damagamunam̐ gām̐giliṁchevu
ikkaḍa śhrīveṁkaḍeśha nīgu sallam̐gāne
makkuvam̐ gūḍi sadamadamayyevu