కాంతల నెన్నడుముల కఱవు దీర
(॥పల్లవి॥)
కాంతల నెన్నడుముల కఱవు దీర
దొంతిమోవిబోనాల జాతుర సేయవయ్యా
(॥కాంతల॥)
చిత్తడిచెమటివాన చెక్కులవెంటాఁ గురిసె
యెత్తిన మదములను యేరులు వారె
గుత్తపు గుబ్బల పెద్దకొండలకు గండి గట్టి
బత్తితోడ వలపుల పైరుసేయవయ్యా
(॥కాంతల॥)
పులకల ససులు గొబ్బున మైనిండా మొలచె
యెలమిఁ దమకముల యెన్నులు వెళ్ళె
కలికిజవ్వనముల కళ్ళాముసేసి నురిపె
కొలపుల బోగాలఁ గోరు గొనవయ్యా
(॥కాంతల॥)
అంగజరాజ్యపదవి కామనికాలము వచ్చె
పొంగి రతులు పోఁకకుఁ బుట్టెఁడాయను
యింగితపు శ్రీవేంకటేశ మమ్ము నేలితివి
సంగతిగా మోహనరాజ్యము లేలవయ్యా
(||pallavi||)
kāṁtala nĕnnaḍumula kaṟavu dīra
dŏṁtimovibonāla jādura seyavayyā
(||kāṁtala||)
sittaḍisĕmaḍivāna sĕkkulavĕṁṭām̐ gurisĕ
yĕttina madamulanu yerulu vārĕ
guttabu gubbala pĕddagŏṁḍalagu gaṁḍi gaṭṭi
battidoḍa valabula pairuseyavayyā
(||kāṁtala||)
pulagala sasulu gŏbbuna mainiṁḍā mŏlasĕ
yĕlamim̐ damagamula yĕnnulu vĕḽḽĕ
kaligijavvanamula kaḽḽāmusesi nuribĕ
kŏlabula bogālam̐ goru gŏnavayyā
(||kāṁtala||)
aṁgajarājyabadavi kāmanigālamu vachchĕ
pŏṁgi radulu pom̐kagum̐ buṭṭĕm̐ḍāyanu
yiṁgidabu śhrīveṁkaḍeśha mammu nelidivi
saṁgadigā mohanarājyamu lelavayyā