Kaamtala manasuloni kaṟavu vaase

కాంతల మనసులోని కఱవు వాసె
Language

(॥పల్లవి॥)
కాంతల మనసులోని కఱవు వాసె
అంతటా జవ్వనమనే ఆమని కాలమున

(॥కాంత॥)
వేవేలు గొల్లెతలపై వెరవెట్టి వలపులు
నీవు లూడ్చి కొలనిలో నీరుగట్టెను
వేవేలు దొడ్లకాడ వెలుఁగులు వెట్టి పెట్టి
కేవల మితనికి నాఁగేలూ వొకటే

(॥కాంత॥)
దుండగపుగోళ్లను దోమటిఁ గలుపుదీసి
బండిగట్టె రుకుమిణిభామపెండ్లికి
కొండలంతలుచన్నులఁ గొటారుకుప్పలు వేసె
పండెఁ గట్టుకొమ్మనవ పైఁడి చీర వరచి

(॥కాంత॥)
పచ్చిమోవికణఁజాల బండారించి ముద్రవెట్టె
రచ్చలఁ గాఁగిళ్లఁ గాఁపురాలు సేసెను
యిచ్చట శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నేరుపరి
కుచ్చి కుచ్చి రతిసేయఁ గొండవేలూ నాయను

(||pallavi||)
kāṁtala manasuloni kaṟavu vāsĕ
aṁtaḍā javvanamane āmani kālamuna

(||kāṁta||)
vevelu gŏllĕdalabai vĕravĕṭṭi valabulu
nīvu lūḍchi kŏlanilo nīrugaṭṭĕnu
vevelu dŏḍlagāḍa vĕlum̐gulu vĕṭṭi pĕṭṭi
kevala midanigi nām̐gelū vŏgaḍe

(||kāṁta||)
duṁḍagabugoḽlanu domaḍim̐ galubudīsi
baṁḍigaṭṭĕ rugumiṇibhāmabĕṁḍligi
kŏṁḍalaṁtalusannulam̐ gŏḍāruguppalu vesĕ
paṁḍĕm̐ gaṭṭugŏmmanava paim̐ḍi sīra varasi

(||kāṁta||)
pachchimovigaṇam̐jāla baṁḍāriṁchi mudravĕṭṭĕ
rachchalam̐ gām̐giḽlam̐ gām̐purālu sesĕnu
yichchaḍa śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu nerubari
kuchchi kuchchi radiseyam̐ gŏṁḍavelū nāyanu