Kaamtagu neegunu nela kaamtaalaalu

కాంతకు నీకును నేల కాఁతాళాలు
Language

(॥పల్లవి॥)
కాంతకు నీకును నేల కాఁతాళాలు
వింతవారెల్లా నీకు వెక్కసమయ్యేరా

(॥॥)
సారెసారె నీదేవులై జింకించ వచ్చెఁగాక
తేరసతులెల్ల నినుఁ దెమలించేరా
నేరుపరిగనక తా నిన్ను వెంగేలాడెఁగాక
వూరివారెల్లా నిట్టె వొరయవచ్చేరా

(॥॥)
వడి నామోహపుటింతి వట్టినేరా లెంచెఁగాక
కడవారెల్లా నిన్నుఁ గక్కసించేరా
అడియాలమైనయాపె ఆనలెల్లాఁ బెట్టెఁగాక
బడిబడివారెల్లా వొడివట్టెరా

(॥॥)
నెట్టన నలమేల్మంగ నీవురాన నిల్చెఁగాక
పొట్టఁబొరుగువారెల్లా బోదించేరా
ఇట్టె శ్రీ వేంకటేశ ఇటు నే మొక్కితిఁగాక
చుట్టపువారెల్లా నింతసోదించేరా

(||pallavi||)
kāṁtagu nīgunu nela kām̐tāḽālu
viṁtavārĕllā nīgu vĕkkasamayyerā

(||||)
sārĕsārĕ nīdevulai jiṁkiṁcha vachchĕm̐gāga
terasadulĕlla ninum̐ dĕmaliṁcherā
nerubariganaga tā ninnu vĕṁgelāḍĕm̐gāga
vūrivārĕllā niṭṭĕ vŏrayavachcherā

(||||)
vaḍi nāmohabuḍiṁti vaṭṭinerā lĕṁchĕm̐gāga
kaḍavārĕllā ninnum̐ gakkasiṁcherā
aḍiyālamainayābĕ ānalĕllām̐ bĕṭṭĕm̐gāga
baḍibaḍivārĕllā vŏḍivaṭṭĕrā

(||||)
nĕṭṭana nalamelmaṁga nīvurāna nilsĕm̐gāga
pŏṭṭam̐bŏruguvārĕllā bodiṁcherā
iṭṭĕ śhrī veṁkaḍeśha iḍu ne mŏkkidim̐gāga
suṭṭabuvārĕllā niṁtasodiṁcherā