Kaamtagalanaadum yegaamtamulamaada

కాంతగలనాడుఁ యేకాంతములమాట
Language

(॥పల్లవి॥)
కాంతగలనాడుఁ యేకాంతములమాట - శ్రీ-
కాంతుఁడవు నీవు యిందుకొఱకు నా కాఁక లేల కడపరాయ

(॥కాంత॥)
మానవతి నీవు చనుమానమనఁ బెంచితి నేఁడు
పూని నే మెంత పిలిచిన రా వనుమాన మేల కడపరాయ

(॥కాంత॥)
మారుఁ డంతలోనే నీ కుమారుఁ డయ్యండి
మారుకొనె జూడు సారె సారె నెడమాట లేల కడపరాయ

(॥కాంత॥)
ఆడఁ జెలిఁ జూచి మారాడలేక నీవు
కూడితివి శ్రీవేంకటగిరిపైఁ గోరికమీఱఁ గడపరాయ

(||pallavi||)
kāṁtagalanāḍum̐ yegāṁtamulamāḍa - śhrī-
kāṁtum̐ḍavu nīvu yiṁdugŏṟagu nā kām̐ka lela kaḍabarāya

(||kāṁta||)
mānavadi nīvu sanumānamanam̐ bĕṁchidi nem̐ḍu
pūni ne mĕṁta pilisina rā vanumāna mela kaḍabarāya

(||kāṁta||)
mārum̐ ḍaṁtalone nī kumārum̐ ḍayyaṁḍi
mārugŏnĕ jūḍu sārĕ sārĕ nĕḍamāḍa lela kaḍabarāya

(||kāṁta||)
āḍam̐ jĕlim̐ jūsi mārāḍalega nīvu
kūḍidivi śhrīveṁkaḍagiribaim̐ gorigamīṟam̐ gaḍabarāya