Kaamtabai neppudu batti galavu neevu

కాంతపై నెప్పుడు బత్తి గలవు నీవు
Language

(॥పల్లవి॥)
కాంతపై నెప్పుడు బత్తి గలవు నీవు
మంతనాన నేనూ నీకు మనవి చెప్పితిని

(॥॥)
అవధరించితివా అతివ విన్నపములు
తవిలి యిప్పుడు నీ చిత్తము వచ్చునా
వివరించి నేఁ డాకె నీవే గతి యని వున్నది
యివలఁ జెలిఁ గనక యెచ్చరించే నేనూ

(॥॥)
కరుణించి చూచితివా కాంత యంపినకానికె
సరవితో నీ కది సమ్మతేయనా
నిరతిఁ దనయాసలు నీపైఁ బెట్టు కున్నది
పరిచారకురా లని భావము దెలిసెను

(॥॥)
అట్టే మన్నించితివా అలమేల్మంగనుఁ గూడి
వొట్టి శ్రీ వేంకటేశ్వర వోవరిలోన
నెట్టన సంతోసాన నిన్ను మెచ్చుచున్నది
యిట్టే వూడిగపు వార మిద్దరిఁ బొగడేమూ.

(||pallavi||)
kāṁtabai nĕppuḍu batti galavu nīvu
maṁtanāna nenū nīgu manavi sĕppidini

(||||)
avadhariṁchidivā adiva vinnabamulu
tavili yippuḍu nī sittamu vachchunā
vivariṁchi nem̐ ḍāgĕ nīve gadi yani vunnadi
yivalam̐ jĕlim̐ ganaga yĕchchariṁche nenū

(||||)
karuṇiṁchi sūsidivā kāṁta yaṁpinagānigĕ
saravido nī kadi sammadeyanā
niradim̐ danayāsalu nībaim̐ bĕṭṭu kunnadi
parisāragurā lani bhāvamu dĕlisĕnu

(||||)
aṭṭe manniṁchidivā alamelmaṁganum̐ gūḍi
vŏṭṭi śhrī veṁkaḍeśhvara vovarilona
nĕṭṭana saṁtosāna ninnu mĕchchusunnadi
yiṭṭe vūḍigabu vāra middarim̐ bŏgaḍemū.