Kaamta vaddane vunnadi kaamgilimchugommanave

కాంత వద్దనే వున్నది కాఁగిలించుకొమ్మనవే
Language

(॥పల్లవి॥)
కాంత వద్దనే వున్నది కాఁగిలించుకొమ్మనవే
వంతల నెవ్వరైనాను వలదనేరా

(॥కాంత॥)
యెన్ని వేసాలు సేసీనే యీతఁ డాకెకు వలచి
వెన్నెలలు వేఁడులంటా వెరగందీని
విన్నవారుఁ గన్నవారు వెస నవ్వేదెఱఁగఁడు
వన్నెల పూవుటమ్మలువాండ్లనీని

(॥కాంత॥)
యింత బూటకములేలే యీపె భ్రమలకు లోనై
కంతుఁడు దోసకారెని కడు దూరీని
చెంతల నిందరిలోనా సిగ్గుపడ నేరఁడు
పొంతనున్న చలిగాలి బూత మనీని

(॥కాంత॥)
ఆగడాలు నేర్చెఁగదె అలమేలుమంగఁ గూడి
సోగ కన్నులను నవ్వి సొంపు మీరీని
యీగతినె శ్రీవేంకటేశుఁ డిదె నన్ను నేలె
బాగుగా బెక్కురతుల పంతమాడీని

(||pallavi||)
kāṁta vaddane vunnadi kām̐giliṁchugŏmmanave
vaṁtala nĕvvarainānu valadanerā

(||kāṁta||)
yĕnni vesālu sesīne yīdam̐ ḍāgĕgu valasi
vĕnnĕlalu vem̐ḍulaṁṭā vĕragaṁdīni
vinnavārum̐ gannavāru vĕsa navvedĕṟam̐gam̐ḍu
vannĕla pūvuḍammaluvāṁḍlanīni

(||kāṁta||)
yiṁta būḍagamulele yībĕ bhramalagu lonai
kaṁtum̐ḍu dosagārĕni kaḍu dūrīni
sĕṁtala niṁdarilonā siggubaḍa neram̐ḍu
pŏṁtanunna saligāli būda manīni

(||kāṁta||)
āgaḍālu nersĕm̐gadĕ alamelumaṁgam̐ gūḍi
soga kannulanu navvi sŏṁpu mīrīni
yīgadinĕ śhrīveṁkaḍeśhum̐ ḍidĕ nannu nelĕ
bāgugā bĕkkuradula paṁtamāḍīni