కాంత పొరుగు పోరచి గంటివా వోయి
(॥పల్లవి॥)
కాంత పొరుగు పోరచి గంటివా వోయి
యింతలోన నీ చిత్త మెట్టున్నదో కాని
(॥॥)
చేరి నీతో మాటాడఁగా చెక్కులెల్లాఁ జెమరించె
గారాపు నీ చెలిలాగు గంటివా వోయి
సారె సారెఁ జూడఁ గాను జారీఁ బయ్యదకొంగు
ఆరితేరి యెటువంటి ఆసోదమో కాని
(॥॥)
చెలరేఁగి నిన్నుఁ జూచి చిత్త మెల్లాఁ గరఁగీని
కలికి జాణతనాలు గంటివా వోయి
నిలువునఁ జొక్కి చొక్కి నివ్వెఱఁగు నొందీని
తలపోఁత లెందు మోవఁ దలఁచేనో కాని
(॥॥)
తతి నీ పాదా లొత్తి తనివోక కొసరీని
కతకారి తనములు గంటివా వోయి
యితవై శ్రీ వేంకటేశ ఇంతలో నన్నేలితివి
మతిలోనఁ దా నెంత మరిగీనో కాని
(||pallavi||)
kāṁta pŏrugu porasi gaṁṭivā voyi
yiṁtalona nī sitta mĕṭṭunnado kāni
(||||)
seri nīdo māḍāḍam̐gā sĕkkulĕllām̐ jĕmariṁchĕ
gārābu nī sĕlilāgu gaṁṭivā voyi
sārĕ sārĕm̐ jūḍam̐ gānu jārīm̐ bayyadagŏṁgu
ārideri yĕḍuvaṁṭi āsodamo kāni
(||||)
sĕlarem̐gi ninnum̐ jūsi sitta mĕllām̐ garam̐gīni
kaligi jāṇadanālu gaṁṭivā voyi
niluvunam̐ jŏkki sŏkki nivvĕṟam̐gu nŏṁdīni
talabom̐ta lĕṁdu movam̐ dalam̐seno kāni
(||||)
tadi nī pādā lŏtti tanivoga kŏsarīni
kadagāri tanamulu gaṁṭivā voyi
yidavai śhrī veṁkaḍeśha iṁtalo nannelidivi
madilonam̐ dā nĕṁta marigīno kāni