Kaamta neevugala sodu kalimigalugu sodu

కాంత నీవుగల చోటు కలిమిగలుగు చోటు
Language

(॥పల్లవి॥)
కాంత నీవుగల చోటు కలిమిగలుగు చోటు
కాంతుని కితరమెల్లాఁ గడగడ చోటు

(॥కాంత॥)
సతి నీమోమెత్తుటే చంద్రోదయమౌట
అతివ నీతలవంపు అస్తమానము
మితి నీచూచినచూపే మించిన సూర్యోదయము
రతి రెప్పమూయుటే యారవియస్తమానము

(॥కాంత॥)
పొలఁతి నీవు నవ్వుటే పున్నమపెనుఁబండుగ
మలసి కోపించుటే యమాసదినము
అలరి మాటాడినదే ఆమనికాలము నీవు
వొలసీవొల్లమి నుండు టుడివోపుఁగాలము

(॥కాంత॥)
యింతి నీవు గూడుటే యెన్నిక విరహవేళ
అంతో మైమఱచుటే యానందవేళ
పంతపు శ్రీవేంకటాద్రిపతికి నీవిట్లనే
మంతనాన నుండుటే మరుజన్మవేళ

(||pallavi||)
kāṁta nīvugala soḍu kalimigalugu soḍu
kāṁtuni kidaramĕllām̐ gaḍagaḍa soḍu

(||kāṁta||)
sadi nīmomĕttuḍe saṁdrodayamauḍa
adiva nīdalavaṁpu astamānamu
midi nīsūsinasūbe miṁchina sūryodayamu
radi rĕppamūyuḍe yāraviyastamānamu

(||kāṁta||)
pŏlam̐ti nīvu navvuḍe punnamabĕnum̐baṁḍuga
malasi kobiṁchuḍe yamāsadinamu
alari māḍāḍinade āmanigālamu nīvu
vŏlasīvŏllami nuṁḍu ṭuḍivobum̐gālamu

(||kāṁta||)
yiṁti nīvu gūḍuḍe yĕnniga virahaveḽa
aṁto maimaṟasuḍe yānaṁdaveḽa
paṁtabu śhrīveṁkaḍādribadigi nīviṭlane
maṁtanāna nuṁḍuḍe marujanmaveḽa