కాంత నీ కతముననే ఘనుఁ డాతఁడు
(॥పల్లవి॥)
కాంత నీ కతముననే ఘనుఁ డాతఁడు
యింతవడి బ్రహ్మమై యెఱుకపడఁ డతఁడు
(॥కాంత॥)
లలన నీ కొనగోరి లక్షణంబులఁ గదా
తొలుత నీ పతి యచ్యుతుఁ డైనది
జలజాక్ష నీ కటాక్షపుఁ గరుణనే కదా
అలరి పీతాంబరుఁడై వెలసె నతఁడు
(॥కాంత॥)
వువిద నీ జనియించు వుదయఫలమునఁ గదా
జవళి నసురల గెలిచి శౌరి యాయ
భువి నీవు దేవివై పొలుపు మిగులఁగఁ గదా
అవల బ్రహ్మకుఁ దండ్రియై వెలసె నతఁడు
(॥కాంత॥)
ముదిత నీ వెపుడు నురమున నుండఁగా గదా
కదనఁ గౌస్తుభవక్షుఁ డాయ నతఁడు
కదిసి యలమేలుమంగ నీ వగుటకుఁ గదా
చదల శ్రీవేంకటేశ్వరుఁ డాయ నతఁడు
(||pallavi||)
kāṁta nī kadamunane ghanum̐ ḍādam̐ḍu
yiṁtavaḍi brahmamai yĕṟugabaḍam̐ ḍadam̐ḍu
(||kāṁta||)
lalana nī kŏnagori lakṣhaṇaṁbulam̐ gadā
tŏluda nī padi yachyudum̐ ḍainadi
jalajākṣha nī kaḍākṣhabum̐ garuṇane kadā
alari pīdāṁbarum̐ḍai vĕlasĕ nadam̐ḍu
(||kāṁta||)
vuvida nī janiyiṁchu vudayaphalamunam̐ gadā
javaḽi nasurala gĕlisi śhauri yāya
bhuvi nīvu devivai pŏlubu migulam̐gam̐ gadā
avala brahmagum̐ daṁḍriyai vĕlasĕ nadam̐ḍu
(||kāṁta||)
mudida nī vĕbuḍu nuramuna nuṁḍam̐gā gadā
kadanam̐ gaustubhavakṣhum̐ ḍāya nadam̐ḍu
kadisi yalamelumaṁga nī vaguḍagum̐ gadā
sadala śhrīveṁkaḍeśhvarum̐ ḍāya nadam̐ḍu