కాంత లాగు ఇంకా మీఁదఁ గనేవు నీవు
(॥పల్లవి॥)
కాంత లాగు ఇంకా మీఁదఁ గనేవు నీవు
చెంత నుండి నే నీకు చెప్పితి నీ సుద్దులు
(॥కాంత॥)
బలిమిఁ గొసరెనట పంతమాడెనట ఆపె
చెలి నీతో ఆమాట చెప్పదాయనా
చలము సాదించెనట సాటికి బెనఁగెనట
వెలదిసుద్దులు నీవు వినవా ఇంకాను
(॥కాంత॥)
యెద దట్టుకొనెనట యెమ్మెలల్లాఁ జూపెనట
యిదెల్లా నీ వంపినాపె యెచ్చరించదా
వుదుటున నవ్వెనట వూరకె జంకించెనట
కొదలేకివి దెలుసుకొనవా ఇంకాను
(॥కాంత॥)
లోనికిఁ దా వచ్చెనట లోలో నిన్నుఁ గూడెనట
తానే నీ దూతిక మూసిదాఁచదాయనా
పూని శ్రీవేంకటేశుఁడ పొందితివి నన్ను నేఁడు
సోనల చంద్రకళలు చూడవా ఇంకాను
(||pallavi||)
kāṁta lāgu iṁkā mīm̐dam̐ ganevu nīvu
sĕṁta nuṁḍi ne nīgu sĕppidi nī suddulu
(||kāṁta||)
balimim̐ gŏsarĕnaḍa paṁtamāḍĕnaḍa ābĕ
sĕli nīdo āmāḍa sĕppadāyanā
salamu sādiṁchĕnaḍa sāḍigi bĕnam̐gĕnaḍa
vĕladisuddulu nīvu vinavā iṁkānu
(||kāṁta||)
yĕda daṭṭugŏnĕnaḍa yĕmmĕlallām̐ jūbĕnaḍa
yidĕllā nī vaṁpinābĕ yĕchchariṁchadā
vuduḍuna navvĕnaḍa vūragĕ jaṁkiṁchĕnaḍa
kŏdalegivi dĕlusugŏnavā iṁkānu
(||kāṁta||)
lonigim̐ dā vachchĕnaḍa lolo ninnum̐ gūḍĕnaḍa
tāne nī dūdiga mūsidām̐sadāyanā
pūni śhrīveṁkaḍeśhum̐ḍa pŏṁdidivi nannu nem̐ḍu
sonala saṁdragaḽalu sūḍavā iṁkānu