Kaampuramu seyavayyaa kalagaalamu neereedi

కాఁపురము సేయవయ్యా కలకాలము నీరీతి
Language

(॥పల్లవి॥)
కాఁపురము సేయవయ్యా కలకాలము నీరీతి
దాఁపురాలై మీ పొందులు తారుకాణలాయను

(॥కాఁపు॥)
కచ్చుక నీరాక కీపె కాచుకున్నందుకు నీవు
విచ్చేసితి వింతలోనె వేడుకతోను
తచ్చి మీ తలపోఁతలు తాళమువేసి నట్టాయ
మెచ్చిరి చెలుల్లాను మేలు మేలయ్యా

(॥కాఁపు॥)
మునుకొని యీపె నీకుమొక్కులుమొక్కినందుకు
యెనసి కాఁగిలించితి వెదురుకొని
మొనసిన మీ చేఁతలు ముయికి ముయ్త్యె నట్టాయ
పొనుఁగక మీ గుణాలు పొగడి రిందురును

(॥కాఁపు॥)
పమ్ముకొని యాపె నీకు బాగా లిచ్చినందుకు
తమ్ముల మొసఁగితివి తమితోడను
నెమ్మి శ్రీవేంకటేశ మీ నేర్పు సరి బేసులాయ
సమ్మతితో మీకు నెల్లా సంతోసములాయ

(||pallavi||)
kām̐puramu seyavayyā kalagālamu nīrīdi
dām̐purālai mī pŏṁdulu tārugāṇalāyanu

(||kām̐pu||)
kachchuga nīrāga kībĕ kāsugunnaṁdugu nīvu
vichchesidi viṁtalonĕ veḍugadonu
tachchi mī talabom̐talu tāḽamuvesi naṭṭāya
mĕchchiri sĕlullānu melu melayyā

(||kām̐pu||)
munugŏni yībĕ nīgumŏkkulumŏkkinaṁdugu
yĕnasi kām̐giliṁchidi vĕdurugŏni
mŏnasina mī sem̐talu muyigi muydyĕ naṭṭāya
pŏnum̐gaga mī guṇālu pŏgaḍi riṁdurunu

(||kām̐pu||)
pammugŏni yābĕ nīgu bāgā lichchinaṁdugu
tammula mŏsam̐gidivi tamidoḍanu
nĕmmi śhrīveṁkaḍeśha mī nerbu sari besulāya
sammadido mīgu nĕllā saṁtosamulāya